ఆరోగ్యం గా ఉండడమంటే ఆనందంగా ఉండటమే.. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు కచ్చితంగా ఆనందంగా ఉంటారంటారు. నిజమే కదా! ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చేసే ప్రయత్నాలు ఎన్నో.  ఆరోగ్యానికి మంచిదని రోజు ఓట్స్ తింటున్నారా?  అయితే ఓట్స్ తినే ముందు వాటి గురించి ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. నేటి త‌రుణంలో ఓట్స్‌ను సూప‌ర్ ఫుడ్ గా ప‌రిగ‌ణిస్తున్నారు. ఎందుకంటే ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు ఉన్న‌వారికి మేలు చేస్తాయి. అందుక‌నే ప్ర‌స్తుతం వైద్యులు, న్యూట్రిష‌నిస్టులు ఓట్స్‌ను ఆహారంగా తీసుకోవాల‌ని చెబుతున్నారు. 

 

వాస్త‌వానికి ఓట్స్ గురించి ఇపుడిపుడే మనలో చాలా మందికి అవగాహన కలుగుతోంది. ఓట్స్ ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. దీనిలో కొలెస్ట్రాల్, రక్తపోటును నివారించే బీటా గ్లూటెన్ అనే ఓ రకమైన కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ మీద పోరాటం చేస్తాయి. దీంతో శ‌రీర క‌ణ‌జాలం నాశ‌నం కాకుండా ఉంటుంది. అలాగే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

 

 హైబీపీ, క్యాన్స‌ర్ ల‌ను త‌గ్గించే గుణాలు ఓట్స్‌లో ఉంటాయి.  అంతేకాదు, ఓట్స్ తిన‌డం వ‌ల్ల చ‌ర్మం సంర‌క్షింప‌బ‌డి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఓట్స్ మంచి ఆహారం. కొద్దిగా ఓట్స్‌ను తిన్నా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ స‌మ‌యం వేచి ఉన్నా ఆక‌లి కాదు. ఇక ఓట్స్ ను ఎక్కువ మంది ఉదయం పాలు లేదా నీటిలో ఉడికించి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఈ విధంగా నెలరోజులు చేసి బరువు చూసుకుంటే తేడా మనకే తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: