మన శరీరంలో ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవయవం ఏది అంటే.. నిసందేహంగా చెప్పేయచ్చు.. కళ్ళు అని. అయితే ఆ కళ్ళ జాగ్రత్త ఏలా తీసుకోవాలంటే.. బీట్ రూట్ తో తీసుకోవాలి. కొంత వయసు వచ్చాక బలిహీనా పడే కళ్ళను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బలిహీనం అవుతున్నాం అని తెలిసిన ప్రారంభంలోనే సమస్య గురించి శ్రద్ద వహించాలి.. అప్పుడే ముందు ముందు జరిగే దారుణాలు జరగవు. 

 

కొన్ని జబ్బులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తీసుకోకుంటే మందులూ కూడా ఆ జబ్బులను నయం చేయలేవు. సర్జరీతో ఒరిగేదీ ఏమీ ఉండదు. అందువల్ల ఏదైనా ఒక వ్యాధి వచ్చి, అది ముదిరే దాకా చూసి నానా అవస్థలూ పడే కన్నా, అసలు ఆ జబ్బులు రాకుండానే చూసుకోవడం ఎంతో మంచిది. 

 

ఆలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు రోజువారి ఆహార పదార్థాల్లో కాస్త జాగ్రత్త పడితే చాలు. ప్రత్యేకించి కంటి జబ్బులనే తీసుకుంటే, రోజూ ఆకుకూరలూ, బీట్‌రూట్‌ వంటి వాటిని రోజు వారీ అహారంలో చేరిస్తే దృష్టి లోపం కలిగించే, మాక్యులర్‌ డీజనరేషన్‌ అనే వ్యాధి రాకుండా జాగ్రత్త పడచ్చు. బీట్‌రూట్‌ను రోజుకు 15 గ్రాములు తీసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: