ఈ భూమి మీదకు వచ్చే చిన్నారులకు కూడా సరైన ఆరోగ్యం ఇవ్వలేకపోతోంది భారత దేశం. అదీ మన దుస్థితి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపిల్లల చావుల గురించి వార్తలు వింటుంటే.. ఇంకా ఈ దేశం గొప్పదనం అంతా ఏం చేసుకోవాలనిపిస్తోంది. మొన్నటికి మొన్న రాజస్థాన్ కోటాలో చిన్నారుల పదుల సంఖ్యలో మరణించారు.

 

రాజ్ కోట్ లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో ఒక్క డిసెంబర్ నెలలోనే 111 మంది పసిపిల్లలు చనిపోయారు. అంతకు ముందు నవంబర్ నెలలో 70 1 మంది చనిపోయారు. దాని కంటే ముందు అక్టోబర్ లో 87 మంది చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలే.

 

ఇప్పుడు ఇలాంటిదే గుజరాత్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జరుగుతోంది. ఇక్కడా పసిపిల్లల మృత్యుఘోష కొనసాగుతోంది. అహ్మదాబాద్ లోని ఓ ఆస్పత్రిలో డిసెంబర్ నెలలో 85 మంది చిన్నారులు మరణించారు. ఇదే ఆస్పత్రిలో నవంబర్ లో 74, అక్టోబర్ లో 94 మంది చనిపోయారు. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ ..ప్రతి వెయ్యి మందికి 30 మంది చిన్నారులు మాత్రమే మరణిస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు.. తీవ్ర అనారోగ్యకారణాలు, తక్కువ బరువు వల్లే చిన్నారుల మరణాలు పెరుగుతున్నాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: