సాధార‌ణంగా ట‌మాటాలు తెలియ‌ని వారు.. తిన‌ని వారు ఉండ‌రు. టమాటల్లో శరీరానికి మేలు చేసే పోషకాలు, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ విలువలుంటాయి. యాంటీఆక్సిడెంట్ లైకోపిన్, విటమిన్ సి, పోటాషియం, ఫొలేట్, విటమిన్ కె ఉండే టమాటను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలాగే టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగుని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. అయితే ఆరోగ్యానికి.. అందానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ ఎక్కువ‌గా తింటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

 

ముఖ్యంగా బోవెల్ సిండ్రోమ్ తో ఎక్కువగా బాధపడుతున్న వారికి ఈ టమాటాల్లో అధిక వినియోగం కారణంగా ఈ పరిస్థితిని మరింతగా దిగజార్చుతుంది, అలాగే కడుపు ఉబ్బరానికి కూడా దారితీస్తాయి. అలాగే ఎవరైతే సాధారణంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారందరూ పొటాషియం తీసుకోవడాన్ని పరిమితం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ పొటాషియం అనేది ముఖ్యంగా టమోటాలలో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మరిన్ని ఇబ్బందులను కలిగించవచ్చు.

 

అదే విధంగా,  టమాటాలను వినియోగించేటప్పుడు, వాటిల్లో ఉండే సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నందున రక్తపోటు స్థాయిల నియంత్రణలో అవి జోక్యం చేసుకోలేవు. నిజానికి, ఇవి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలా అని టమోటాల వినియోగాన్ని ఇతర మార్గాలలో ఎక్కువగా వినియోగించినట్లయితే, అందులో ఉండే సోడియం స్థాయిలో పెరగటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మరింత హానిని తలపెడ‌తాయి. సో.. ప‌రిమితికి మించి ఏది తీసుకున్నా అవి ఆరోగ్యాన్ని కాకుండా అనారోగ్యాల‌ను తెచ్చిపెడ‌తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: