సాధార‌ణంగా ప‌న్నీర్ తెలియ‌ని వారుండ‌రు. ప్రాచీన భారతదేశపు కాలంనుండి పనీర్ అంటే సాంప్రదాయ దక్షిణాసియా వంటిళ్ళలో ఉపయోగించే అతి సాధారణ పాలవిరుగుడు. అయితే వెజిటేరియన్స్‌కి టాప్ లిస్ట్‌లో ఉండేది.. నాన్‌వెజిటేరియన్స్‌నీ కట్టి పడేసేది.. ఏదైనా ఉందంటే.. అది కచ్ఛితంగా పన్నీరే. పాలనుంచి తయారయ్యే పన్నీర్ లో అనేక పోషకాలుండి మనశరీర ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. కొంతమందైతే పన్నీర్ ను పచ్చిగానే తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. అయితే పన్నీర్ కర్రీ కేవలం నాలుకకే కాదు శరీరానికి కూడా చాలామంచిది.

 

పన్నీర్ తినడం వల్ల భారీగా లావు అయిపోతారు అని, కొలస్ట్రాల్ పెరుగుతుందని అందరూ అంటుంటారు. దీనికి కారణం ఇది పాల వస్తువు కాబట్టి. కానీ పన్నిర్ లో అలాంటి సమస్యలు ఏవి ఉండవట. అలాగే కొవ్వు కరిగించే శక్తి పన్నీర్‌కి ఉందని ఒక అధ్యయనం  కూడా చెబుతున్నది. ఇక ప‌న్నీర్ గుండెకు ఎంతో మంచిది, రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. పన్నీర్‌లో ఉండే మెగ్నీషియం క్యాటలిస్టులా పనిచేస్తుంది, జీవ రసాయనిక చర్యల్ని ప్రోత్సహిస్తుంది. పన్నీర్ ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మనకు రోజూ అవసరమయ్యే కాల్షియంలో ఎనిమిది శాతం దీని ద్వారా లభిస్తుంది.

 

ఇది పిల్లలు, పెద్దల్లో ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది. గర్భవతులైన మహిళలకు అత్యుత్తమైన ఆహారం పన్నీరు. అదేవిధంగా పన్నీర్ లోని పీచుపదార్థం జీవక్రియను పెంచి బరువు తగ్గటంలో సాయపడుతుంది. పన్నీర్‌లో ఉండే వే ప్రోటీన్... ఎంతో ఆరోగ్యవంతమైనది. ప్లేయర్లు, ఎక్సర్‌సైజ్‌లు చేసేవారికి ఇది మేలు చేస్తుంది. ఇది చాలా నెమ్మదిగా జీర్ణం అవుతూ, నెమ్మదిగా శక్తిని ఇస్తుంది. అందువల్ల అథ్లెటిక్స్‌, బాడీ బిల్డర్‌లు, స్ప్రింటర్‌లు, ఆటలు ఆడేవారికి ఇది ఎంతో మేలైన ఆహారం.

మరింత సమాచారం తెలుసుకోండి: