ఉదయంపూట  టిఫిన్‌తో మొదలై , మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ , రాత్రి మళ్లీ భోజనంతో రోజు ముగుస్తుంది. ఎక్కువ మంది అనుసరించే భోజన విధానం ఇదే. కానీ కొందరు తమకు నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు, ఏదిపడితే అది ఆహారంగా తింటారు. అయితే అది మ‌న శ‌రీరానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా బరువు తగ్గేందుకు ఎక్సర్‌సైజ్‌లు చెయ్యడమే కాదు.. ఏం తినాలన్నా ముందూ వెనకా ఆలోచించుకోవాల్సిందే. అయితే రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా రాత్రి పూట నిద్ర‌కు ముందు తిన‌కూడని కొన్ని అధిక క్యాలరీ ఆహారాలు ఉన్నాయి.

 

రాత్రి భోజనం చేశాక ఐస్ క్రీమ్ తింటే ఆ సంతృప్తే వేరు. కానీ బరువు తగ్గాలనుకునేవారికి ఐస్ క్రీమ్ అంత డేంజర్ ఇంకోటి ఉండదు. ఐస్ క్రీమ్‌లలో బోలెడంత షుగర్, ఎక్కువ కేలరీలు ఉంటాయి. ద్దగా జ్యూసిగా, రుచికరమైన పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వీటిని పగలు తింటే జీర్ణం అవ్వడానికి సరిపడా సమయం ఉంటుంది. అదే రాత్రుల్లో తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది.  ఫ్రైడ్ ఫుడ్స్ రాత్రిళ్లో తినకూడదు. వీటిని హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి.

 

అలాగే ఇవి జీర్ణం అవ్వడానికి కూడా కష్టం అవుతుంది.  ఇక బాదం, వాల్‌నట్, జీడిపప్పు, పిస్తా వంటివి ఎక్కువ పోషకాలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఐతే... వీటిలో కేలరీలూ ఎక్కువే. అందువల్ల పడుకునేముందు వీటిని తినకూడదు. చాక్లెట్స్ లో ఫ్యాట్స్, కెఫీన్, కోకా అధికంగా ఉండటం వల్ల వీటిని రాత్రి పూట తింటే త్వ‌ర‌గా జీర్ణం కావు. దీంతో అసిడిటీ సమస్య వ‌స్తుంది. మ‌రియు  షుగర్ ఉండే సోడా లాంటి డ్రింక్స్ అస్స‌లు తాగ‌కూడ‌దు. ఎందుకంటే సోడాల వల్ల ఏ పోషకాలూ కలగవు. వాటిలో కేలరీలు ఎక్కువ. వీటి వల్ల డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్, ఒబెసిటీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: