జీలకర్ర.. వంటలకు రుచినీ, సువాసననూ.. శరీరమికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది ఈ జీలకర్ర. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ జిలకర్రతో అందం ఆరోగ్యం అన్ని ఉంటాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో కూడా ఈ జీలకర్రను ఎక్కువగా వాడుతారట. అయితే ఇన్ని ప్రయోజాలను ఇచ్చే ఈ జిలకర్రతో ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

జీలకర్రను మరిగించి, ఆ నీళ్లను తాగితే కడుపు నొప్పి, మలబద్దకం సమస్య తగ్గి జీర్ణక్రియ చక్కగా పనిచేస్తుంది.

 

జీలకర్ర ఐరన్‌కు మంచి ఔషధం. ఈ జిలకర్రతో రక్తహీనతకు చెక్ పెట్టచ్చు. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం ఈ జిలకర్రతో నెమ్మదిగా పెరుగుతుంది.

 

ఈ జిలకర్రలో అత్యవసర నూనెలు ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి ఊపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తాయి.

 

జీలకర్రలోని యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు చర్మం మీద ముడతల్ని, వయసు పెరగడం వల్ల వచ్చే మచ్చల్ని, చర్మం వదులుకావడాన్ని నియంత్రిస్తాయి.

 

వేడి నీళ్లలో జీలకర్రను వేసి పరిగడుపునే తాగితే రక్తంలో గ్లూకోజ్‌ తగ్గి, డయాబెటీస్‌ అదుపులోకి వస్తుంది. అంతేకాదు ఇలా ఉదయం పూత తాగటం వల్ల లావు కూడా ఈజీగా తగ్గుతారట. 

 

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పెద్దపేగు, రొమ్ము కేన్సర్‌ను నివారించే గుణాలు కూడా ఎన్నో ఉంటాయట. 

 

చూశారుగా.. ఈ చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. రక్తహీనతకు చెక్ పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: