వేపను భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలోని ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లెటూళ్లలో ఉదయాన్నే వేప పుల్లతో పళ్లు తోముకోవడం చాలా మందికి అలవాటు. ఇంట్లో ఒక వేప చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్టేనని చెబుతుంటారు. వాటిలో యాంటీసెప్టిక్, వ్యాధుల్ని తరిమికొట్టే గుణాలుంటాయి. అందుకే ఇండియా, చైనా మందుల తయారీలో వేపను ఎక్కువగా వాడుతున్నారు.

 

వేపను తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అల్సర్లు, మలబద్దకం, ఇన్ఫెక్షన్లు తగ్గించి ఆహార నాళ సంబంధ సమస్యలు రాకుండా చేయడంలో వేప ఉపకరిస్తుంది. ఇక‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి మూడు రకాల వ్యాధులు వస్తున్నాయి. అవి కాన్సర్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్. వీటిలో అత్యంత వేగంగా ఎక్కువ మందికి వస్తున్నది డయాబెటిస్.  అయితే వేప డయాబెటిస్‌ని పూర్తిగా నయం చెయ్యలేదు. కానీ... వ్యాధి తీవ్రతను తగ్గించగలదు.

 

వేపలోని రసాయనాలు శరీరానికి తగినంత ఇన్సులిన్ అందేలా చూస్తాయి. డయాబెటిస్ రోగులకు ఇదెంతో ఉపయోగకరం. డయాబెటిస్ వచ్చే అవకాశాలను వేప తగ్గిస్తుంది. వేపనూనెతో వారానికి రెండుసార్లు హెడ్‌ మసాజ్‌ చేస్తే జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు పోతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది. మ‌రియు వేప పువ్వులతో జ్యూస్‌లా చేసి తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగు పర్చి కొవ్వు కరిగేలా చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: