పన్నిర్.. అబ్బా.. ఉహించుకుంటుంటేనే నోరు ఊరిపోతోంది కదా. అంత నోరు ఊరించే పన్నీర్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా పన్నీర్ కర్రీని తింటుంటాం. అయితే ఈ పనీర్‌తో చేసిన గ్రేవీ, సూప్‌, కర్రీ ఏదైనా ఇష్టంగా లాగించేస్తాం. ప్రొటీన్లతో నిండిన పనీర్‌ను రుచి కోసమే కాదు ఆరోగ్యం కూడా ఇస్తుంది. అయితే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆరోగ్యంగా తయారవ్వండి. 

 

ఈ పన్నీర్ లో బీ కాంప్లెక్స్‌ విటిమిన్లు పుష్కలంగా ఉంటాయి. పనీర్‌ తింటే తొందరగా శక్తి వస్తుంది. 

 

పన్నీర్ రక్తంలో గ్లూకోజ్‌ విడుదలను ఆలస్యం చేసి, చక్కెర నిల్వలు పెరగకుండా చూస్తుంది.

 

పన్నీర్ లోని  మెగ్నీషియం శరీరంలోని లవణాలను బ్యాలెన్స్‌ చేసి రక్తంలో సోడియం నిల్వల్ని తగ్గించి, రక్తపోటును నివారిస్తుంది.

 

పనీర్‌లో పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది. అందుకే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నుంచి ఈజీగా బయటపడేస్తుంది.

 

గర్భిణులకు అవసరమైన ప్రోటీన్లు పనీర్‌లో పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఫోలిక్‌ ఆమ్లం ఎర్రరక్త కణాల ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది.

 

పన్నీర్ లో ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండడం వల్ల డయాబెటిస్ తో బాధపడేవారికి ఈ పనీర్‌ మంచి ఆహారం. 

 

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పనీర్‌ తింటే తొందరగా ఆకలి వేయదు అంతేకాదు ఈ పన్నీర్ లో ఉండే లినోలెనిక్‌ ఆమ్లం అనేది కొవ్వును ఈజీగా కరిగించేస్తుంది. 

 

చూశారుగా.. పన్నీర్ వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి అనేది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ పన్నీర్ కర్రీని ఓ పట్టు పట్టి ఆరోగ్య లాభాలను పొందండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: