సాధార‌ణంగా ఈ సృష్టిలో లభించే ఫలాలు సహజసిద్ధంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి అందించే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, పిండి పదార్థాల వంటివి ఆరోగ్యాన్ని కాపాడ‌తాయి. అందుకే ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తినాలని అంటుంటారు. ఇక రోజుకో యాపిల్ తింటే రోగాల దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. యాపిల్.. అనేక పోషకాలు ఈ పండులో ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉన్నాయి. అయితే యాపిల్ పండే కాదు యాపిల్ టీ కూడా ఆరోగ్యాని మంచిదంటున్నారు నిపుణులు.

 

యాపిల్ టీ కూడా మీ శరీరంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. యాపిల్ టీ రుచికరంగా ఉండడంతో పాటు ఫిట్ నెస్ ను మెయిన్‌టేన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆపిల్‌లో ముఖ్యమైన పోషక విలువలతో పాటు మినరల్స్‌, యాంటి ఆక్సిడెంట్స్‌ అదనంగా ఉంటాయి. యాపిల్‌పై తొక్క కొంతమంది తీసేసి తింటుంటారు కానీ, దాని పైతొక్కలో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని పారేయకుండా టీలో కలుపుకుని తాగొచ్చు. అలాగే యాపిల్ టీ  రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

 

అదే విధంగా, యాపిల్ టీ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌మే కాకుండా సౌందర్యం కూడా పెరుగుతుంది. ఇది చర్మాన్ని కాంతి వంతంగా మెరిపిస్తుంది. ఉదర సంబంధ సమస్యలన్నింటికీ యాపిల్‌ టీ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. జాయింట్‌ పెయిన్‌ సమస్యలకు యాపిల్ టీ తాగితే ఉపశమనం కల్గుతుందంటున్నారు నిపుణులు. యాపిల్ టీలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ ఎన్నో రకాల కేన్సర్ల నుంచి మనల్ని కాపాడతాయి. సో.. ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నా యాపిల్ టీని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: