అసలు తీపి అనేది ఎవరికి ఇష్టం ఉండదు.. చాలా మందికి ఇష్టం. వాటిని చూస్తుంటేనే నోట్లోంచి లాలాజలం ఉరిపోతుంటోంది.  కొంత మంది అతిగా తింటే మరికొంత మంది చాలా తక్కువ తింటారు. ఇక పంచదార అనేది మన జీవితంలో ఎక్కువగానే వాడే పదార్ధం. అయితే పంచదార కంటే బెల్ల౦ వాడకం తీపే మంచిది అంటున్నారు వైద్యులు.


బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉండటంతో శరీరానికి అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ, అధిక బరువు పెరుగుతామన్న భయం అసలే ఉండదట. అదే విధంగా కొన్ని అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పని చేస్తుందని వైద్యులు అంటున్నారు. రాత్రిపూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుందట. అంతే కాకుండా బెల్లం మన శరీరానికి లివర్‌ కు ఎంతగానో మేలు చేస్తుందట.


రోజూ బెల్లం తింటే లివర్‌ లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయని, లివర్‌ శుభ్రంగా ఉంటుందని అంటున్నారు. కాలేయ సంబంధ అనారోగ్యాలు దరి చేరే అవకాశం ఉండదని అంటున్నారు. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో, శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ సమతుల్యంలో ఉంటాయట. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉంటుందని, మన శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుందని చెప్తున్నారు వైద్యులు. 


బెల్లం తినటం వలన అధిక బరువు తగ్గుతారని అంటున్నారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయట. బెల్లం బ్లడ్‌ ఫ్యూరిఫయర్‌ లా బెల్లం పనిచేస్తుంది. దీన్ని తరచూ కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఉంటే రక్తాన్ని శుద్ధి చేస్తుందని సూచిస్తున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్‌ పరిమాణాన్ని కూడా పెంచడంతో పాటు, రక్తహీనతను తగ్గిస్తుందని డాక్టర్లు అంటున్నారు. బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయట. ఇవి శరీరంలోని యాసిడ్‌ లెవెల్స్‌ ని క్రమపద్ధతిలో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని సూచిస్తున్నారు. బెల్లంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బెల్లాన్ని అధికంగా తీసుకునేటట్లు ప్రయత్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: