ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు. ఇక ఉప్పు తక్కువైనా ఎక్కువైనా ముప్పే అనే విషయం తెలిసిందే. ఎక్కువగా తింటే బీపీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. 

 

అయితే ఉప్పు అత్యంత ముఖ్యమైనది, అత్యంత విలువైనది, ఆతి సరసమైనది ఆహార పదార్థాలలో ఏదైన వున్నదంటే అది ఉప్పు మాత్రమే. వంట ఎంత బాగా చేసినా అందు కొంచెం ఉప్పు చేర్చనిదే దాని రుచి రాదు. ఇక‌ ఇంట్లో కూరల్లో వాడే సాధారణ ఉప్పుతో దుష్ఫలితాలున్నా.. రాతి ఉప్పుతో మాత్రం ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది  బీపీని నియంత్రిస్తుంది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం.. రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులను కంట్రోల్ చేస్తుంది. అలాగే అజీర్ణంతో బాధ పడుతూఉన్నప్పుడు లస్సిలో రాతి ఉప్పు మరియు తాజా పుదీనా ఆకులు వేసుకొని త్రాగాలి.

 

రాతి ఉప్పును ఆహారంలో ఉపయోగించడం వలన నిద్ర బాగా పట్టి నిద్రలేమి సమస్య దూరమవుతుంది. అదే విధంగా, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో సగం టేబుల్ స్పూన్ రాతి ఉప్పును వేసి..కరిగిపోయాక తాగాలి. దీని వలన మానసిక ఒత్తిడి దూరమవుతుంది. అయితే ఉప్పు ఎవ‌రెంత తీసుకోవాలంటే.. రోజూ ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తూ, అరమైలు దూరం నడక సాగించే సాధారణ వ్యక్తికి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు అవసరం. అదే కష్టపడి పనిచేసే కూలీకి, కార్మికునికి, క్రీడాకారునికి లేక ఇతరత్రా వ్యాయామాలు చేసే మనిషికి ఇంకాస్త ఎక్కువ అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: