ఆస్తమా అనేది ఊపిరితిత్తులు ఇన్ఫ్లమేషన్ కు గురవటం వలన కలిగే ఒక శ్వాస రుగ్మత. ఆస్తమా స్థాయిలు పెరగటానికి చాలా రకాల కారకాలు ఉన్నాయనే చెప్పాలి. వీటినే ఆస్తమా పెంచే కారకాలుగా పేర్కొంటారు. ఒక వ్యక్తి ఆస్తమా వ్యాధితో భాదాపడుతున్నడంటే, ఆస్తమాను పెంచే కారకాల గురించి తప్పక తెలిసి ఉండాలి. ఈ కారకాలు బ్రాంకియోల్ లో ఇన్ఫ్లమేషన్ ను పెంచటం వలన ఇది కలుగుతుంది. 


కావున ఇలా ఆస్తమా  కారకాలను పెంచే వీటిని గుర్తించి తగిన జాగ్రత్త తీసుకోవటం వలన ఆస్తమా స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. కొంత మందిలో కొన్ని రకాల కారకాల వలన అలర్జీలకు గురై, ఆస్తమా స్థాయిలు అధికం అవుతాయి. వీరిలో శరీర రోగ నిరోధక వ్యవస్థ స్వతహాగా ఆటోమేటిక్ వ్యాధినిరోధక ప్రతిస్పందనను అభివృద్ధి చేసుకోవటం వలన అలర్జీలకు బహిర్గతం అవగానే వారిలో స్కిన్ రాషేస్, చర్మం ఎర్రగా మారటం, తుమ్ములు, కంటి నుండి నీరు కారటం మరియు శ్వాస తీసుకోటానికి ఇబ్బందిగా భావిస్తుంటారు. 


వీటి ఫలితంగా ఆస్తమా స్థాయిలు పెరుగుతాయి. దుమ్ము, జలుబు, పుప్పొడి రేణువులు మరియు గుడ్లు, చీస్, కూరగాయలతో పాటూ కొన్ని రకాల కాస్మెటిక్ ఉత్పత్తులు కూడా ఆస్తమా స్థాయిలను పెంచుతాయి. కొన్ని సార్లు తేలిక పాటి అలర్జీ కారకాలు కూడా ఆస్తమా స్థాయిలను గణనీయంగా పెంచుతాయి దీనినే "అనాఫిలాటిక్ అటాక్" అంటారు. సాధారణంగా పొగ, దుమ్ము, పర్ఫ్యూమ్ మరియు రసాయనాలు ముక్కులో చికాకులను కలిగించి తుమ్ములను వచ్చేలా చేసే ఆస్తమా స్తాయిలబు పెరిగేలా చేస్తాయి. 


ఈ రకం కారకాలు ముక్కు ద్వారా శ్వాస గొట్టాలలో, బ్రాంకియోల్ గుండా ఊపిరితిత్తులలో ఇన్ఫ్లమేషన్ లను కలిగిస్తాయి. ఈ కారకాలు రోగనిరోధక వ్యవస్థను ప్రభావిత పరచకుండా, శ్వాస గొట్టాలలో వాపులను మరియ బ్రాంకియల్ డిలేషన్ ను కలిగిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: