రాత్రి పడుకోవడం ఆలస్యం.. నిద్ర ఎలా లేవలో కూడా తెలియదు.. అయితే నిద్ర ఎలా లేస్తే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామో తెలుసా ? కొన్ని కొన్ని సార్లు అలారం మిస్ అవుతుంది.. సమయం తెలియదు.. సరే అది అంత పక్కన పెడితే.. మంచం ఎలా దిగాలో తెలియదు.. ఎలా దిగితే మంచిదో తెలియదు.. 

 

నిద్ర లేవడం అంటే, చటుక్కున లేచి, ఒళ్లు విరుచుకుని మంచం దిగడం మంచిది కాదు. అప్పటి వరకూ విశ్రాంత స్థితిలో ఉన్న శరీరం అంత ఉత్తేజం పొందేలా నిద్ర లేవడానికి నిర్దిష్ట పద్ధతిని అనుసరించాలి. అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. రేపటి నుండి అలాగే లేచి మీ రోజును ఉత్తేజంగా మొదలు పెట్టండి.  

 

ఉదయం లేచే సమయంలో కుడిపక్కకు తిరిగి లేవాలి. నిద్ర మెలకువ కాగానే కుడిపక్కకు తిరగాలి. నిద్ర లేచిన వెంటనే మెటబాలిజం తక్కువగా ఉంటుంది కాబట్టి, కుడిపక్కకు తిరిగి లేచి, మంచం దిగాలి. అలాకాకుండా ఎడమ పక్కకు తిరిగి, లేచి నిలబడే ప్రయత్నం చేస్తే గుండె మీద ఒత్తిడి పడుతుంది... అందుకే మన చిన్నప్పుడు పెద్ద వాళ్ళు.. కుడి పక్క నుండి లెయ్యి మంచి జరుగుతుంది.. ఎడమ పక్క నుండి లేస్తే నీ రోజు బాగుండదు అని బెదిరిస్తారు. 

 

అరచేతులను రుద్దుకోవాలి.. నిద్ర లేచిన వెంటనే రెండు అరచేతులు రుద్దుకుని కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అరచేతుల్లో ఉండే నాడులు ఉత్తేజితమై శరీర వ్యవస్థ పూర్తి స్పృహలోకి వస్తుంది. ఇలా చెయ్యాలి అని కూడా చెప్తారు.. అదేం అంటే మన రూపు రేఖలను మనం చూసుకుంటే మంచిది అని చెప్తారు. 

 

చూశారుగా.. ఇవి మూఢనమ్మకంగా అయినా.. ఆరోగ్యానికి అయినా ఇలా చేస్తే మీకు మంచిది. ఈరోజు నుండి ఇలా ఫాలో అయిపోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: