ఈ మధ్యకాలంలో బరువు పెరగడం కామన్ అయిపోయింది. అందరూ అత్యధికంగా.. స్పృహ లేకుండా అధికంగా బరువు పెరుగుతున్నారు. ఇలా బరువు పెరిగే వారిలో ఎక్కువ చిన్న వయసు వారే ఉంటున్నారు. అయితే ఆలా చిన్న వయసు వారు అత్యధికంగా బరువు పెరగటానికి ప్రధాన కారణం ఎక్కువగా తినటం.. మానసిక శ్రమ తప్ప శారీరక శ్రమ లేకపోవడమేనట. 

 

అయితే ఆలా బరువు పెరిగిన వారిలో ఒకొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది.. ఒకరికి టైరయిడ్ ఉంటె.. మరొకరికి మరో సమస్య.. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. కొందరికి డయాబెటిస్ ఉంటుంది.. మరికొందరికి మరి కొన్ని సమస్యలు.. అయితే తాజాగా ఓ సంచలన నిజం బయట పడింది. అది ఏంటంటే ?

 

స్థూలకాయం.. ప్రాణాంతక వ్యాధులకు కారణంగా మారుతోందని డెన్మార్క్‌లోని ఆర్హస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. స్థూలకాయంతో శరీర బరువు అధికమవుతున్న కొద్దీ కేన్సర్‌ ముప్పు 12 మేర పెరుగుతుందని వారు పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా 1977 నుంచి 2016 మధ్యకాలంలో చికిత్సపొందిన 3,13,321 మంది స్థూలకాయ బాధితుల ఆరోగ్య నివేదికలను విశ్లేషించారు. వారిలో 20,706 మంది కేన్సర్‌ బారిన పడగా, ఇంకొందరు మధుమేహంతో సతమతమైనట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: