ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం అనే సమస్య సర్వసాధారణం అయిపోయింది. తగినంత విశ్రాంతి లేకపోవడం, వర్క్ టెన్షన్లు, తీసుకునే ఆహారం వలన జుట్టు రాలిపోతుంది. జుట్టు ప్రతిరోజు రాలిపోతున్నట్టు తెలిస్తే మనలో అదో రకమైన టెన్షన్ మొదలవుతుంది. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడం అనే సమస్య పూర్తిగా తొలగిపోతుంది. 
 
ఇన్ఫెక్షన్లు లేదా డాండ్రఫ్ వలన జుట్టు రాలిపోతున్నట్టు అనిపిస్తే వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయడం మంచిది. వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేస్తే ఇన్ఫెక్షన్లు, డాండ్రఫ్ తగ్గుముఖం పడతాయి. వారానికి రెండు లేదా మూడుసార్లు గోరువెచ్చని ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచిది. ఇలా చేస్తే రక్తప్రసరణ పెరగటంతో పాటు జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. 
 
రోజూ తగినంత నీరు తీసుకోకపోయినా జుట్టు రాలే అవకాశం ఉంది. అందువలన రోజుకు 5 నుండి 8 గ్లాసుల నీరు తాగితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. స్టైలింగ్ కొరకు వాడే హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను వీలైనంత వరకు తక్కువగా వాడితే మంచిది. ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేస్తే కూడా జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది. తలపై ఎక్కువగా చెమట పడుతూ ఉంటే నిమ్మ, కలబంద, షాంపూలను ఉపయోగిస్తే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: