చలికాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. గుండె సంబంధిత రోగాలు, డయాబెటిస్, బ్లడ్ ప్లెజర్, ఆస్తమా సమస్యలతో బాధ పడే వారికి చలికాలంలో తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. చలికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండటంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరిగిపోయి షుగర్ సమస్యతో బాధ పడే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
చలికాలంలో డయాబెటిస్ సమస్యతో బాధ పడేవారు కొన్ని టిప్స్ ఫాలో అయితే షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బ్లడ్ షుగర్ స్థాయిలను పండ్లు, కూరగాయలలో ఉండే ఫైబర్, మినరల్స్, విటమిన్స్, పోషక విలువలు అదుపులో ఉంచుతాయి. క్యాబేజీ, వింటర్ స్క్వాష్, స్వీట్ పొటాటో, ఆరెంజ్, జామ పండు ఎక్కువగా తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. 
 
క్యాబేజీని ఆహారంలో తీసుకోవడం వలన శరీరంలో ఫైబర్ శాతం పెరిగి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వింటర్ స్క్వాష్ ఇన్సులిన్ స్థాయిని కంట్రోల్ చేయటంతో పాటు ఇందులో పొటాషియం, ఫైబర్ మరియు ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. స్వీట్ పొటాటో చూడటానికి బంగాళదుంప మాదిరిగా ఉంటుంది. స్వీట్ పొటాటో బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయటంతో పాటు బరువును తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. తేలికగా జీర్ణమయ్యే గుణం ఉన్న నారింజ పండును డైట్ లో చేర్చుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయటంలో ఆరెంజ్ సహాయపడుతుంది. జామ పండులో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: