ప్రస్తుత రోజుల్లో సమాజంలో చాలావరకు కుటుంబ జీవిత పరంగా చూసుకున్న యవ్వన జీవిత పరంగా చూసుకున్నా చాలామందికి సెక్స్ అనేది కామన్ అయిపోయింది. ప్రపంచంలో యూరప్ దేశాలకు మాదిరిగానే...భారతదేశ చట్టాలు కూడా సెక్స్ కి సంబంధించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా కుటుంబ వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే విధంగా సరి కొత్త చట్టాలు ప్రస్తుత రోజుల్లో అమలులోకి వచ్చేసాయి. సిగరెట్ మరియు మందు అలవాటు పడిన వారు ఎలాగైతే అది లేకపోతే ఉండలేరో...తాజాగా సెక్స్ లేకుండా చాలామంది ఉండలేకపోతున్నాట్లు అనేక సర్వేలలో వెల్లడవుతున్నాయి. సమాజం మరియు చట్టాలు అదేవిధంగా టెక్నాలజీ మనిషిలో ఉన్న శృంగార ఆలోచనలను ఉద్వేగ పరిచే విధంగా బయట సమాజంలో వాతావరణం ఉండటంతో చాలామంది సెక్స్ ఎడిక్షన్ కి గురవుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.

 

విషయంలోకి వెళితే సెక్స్ ఎడిక్షన్ వ్యసనం అంటే ఏమిటో తెలుసుకుంటే ఇది  సెక్స్ లో చాల చాల డేంజర్ లెవెల్ అని అంటున్నారు వైద్యులు. సాధారణంగా సెక్స్ అందరూ కోరుకుంటారు. కానీ.. దీనికి బానిసగా మారిన వారి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. సెక్స్ అందుబాటులో లేకపోతే తట్టుకోలేరు విళ్లు. దాని కోసం పరితపించి పోతుంటారు. సాధారణంగా సెక్స్ తర్వాత అందరూ తృప్తి, ఆనందం, రిలాక్సేషన్ కలుగుతాయి. కానీ ఈ సెక్స్ ఎడిక్టర్లు మాత్రం ఒకరకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. వారికి సెక్స్ కావాలి అని అనిపించినప్పుడు దానికోసం ఏది చేయడానికి కూడా వెనకాడరు.

 

మంచి, చెడులాంటివి కూడా ఆలోచించరు. వారి కంట్రోల్ లో వాళ్లు ఉండలేరు. ఎవరో వారిని హిప్నటైజ్ చేసి ఇదంతా చేయిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది చూసేవారికి. అంతెందుకు లైంగిక కోరిక తీర్చుకునే విధానం సహజంగా ఉండదు. ప్రతిదీ అసహజంగా కావాలని కోరుకుంటారు. ఈ వ్యాధి రోజురోజుకీ పెరిగిపోతే చివరాఖరికి సెక్స్ చేయడానికి కూడా దేనికి పనికి రారు అని ఈ సెక్స్ ఎడిక్షన్ కలిగిన వాళ్ళ వల్ల సమాజంలో చాలా దారుణమైన సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి వావివరుసలు లేకుండా ఇలాంటి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు ఇటువంటి వాటి నుండి బయట పడాలంటే మంచి వైద్యులను అదేవిధంగా...ఇతరులను చూసే దృష్టి కోణం కూడా మార్చు కునే విధంగా మనస్తత్వం మార్చుకుంటే బెటరని సరైన స్నేహాలు కలిగి ఉండి ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటే బాగుంటుందని ఇలా జీవితం క్రమబద్ధంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఇటువంటి ఆలోచనలు ఏ మాత్రం దరికి రావు అని కొంతమంది వైద్యులు సలహా ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: