ఊబకాయం.. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య.. ఈ ఊబ కాయం కారణంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. జీవనశైలి మార్పుల వల్ల తిన్నా తినకపోయినా విపరీతంగా లావైపోతుంటారు కొందరు. అయితే ఇప్పుడు ఊబ కాయంతో బాధపడే వారికో శుభవార్త.

 

ఏంటంటే.. ఎవరైతే పచ్చదనానికి వీలైనంత దగ్గరగా జీవిస్తున్నారో, వారి బరువు సాధారణంగా ఉండాల్సినంత ఉంటోందట. మొక్కలకు దగ్గరగా ఉండటం వల్ల కలిగే మానసిక ఆనందం, తోటపని వల్ల జరిగే వ్యాయామం ఇందుకు కారణమట. వీటి వల్ల బరువు తగ్గుతున్నారట. అందువల్ల ఊబకాయంతో ఇబ్బందిపడే వారు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం మొక్కల మధ్య గడపడం మంచిదట.

 

ఊబకాయంపై పచ్చదనం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పరిశీలించిన బార్సిలోనియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ పరిశోధకులు ఈ మాట చెబుతున్నారు. 20 నుంచి 85 ఏళ్ల మధ్య వయసుగల 2,300 మంది మహిళలను సర్వే చేసి ఈ రిజల్ట్ చెప్పారట. సో.. అందుకే సాధ్యమైనంతగా పచ్చదనానినికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: