కొందరు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా.. డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు బద్దకిస్తారు.. తమకు తోచినవో.. లేదా మందుల షాపు వాళ్లను అడిగి... వాళ్లు చెప్పినవో మంది బిల్లలు మింగేస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లే తీరిక లేకపోవడం ఒక కారణమైతే.. డాక్టర్ ఫీజులు ఆదా అవుతాయి కదా.. ఈ చిన్న దానికి కూడా డాక్టర్ దగ్గరకు ఎందుకున్న నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది.

 

అయితే ఈ సొంత వైద్యం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. ప్రత్యేకించి పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు తొలి ఐదేళ్లు ఎంతో కీలకమని చెబుతున్నారు. ఈ సమయంలో వారికిచ్చే యాంటీబయోటిక్స్‌ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలట.

 

ఎందుకంటే.. చిన్నపిల్లలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతుంటారు. అలాంటి సమయాల్లో మెడికల్‌ షాప్‌ నుంచి మందులు తెచ్చి వేస్తుంటారు. అప్పటికీ తగ్గకపోతేనే ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు . ఇలా చేయడం వల్ల దుకాణాల్లో ఔషధానికి అనుబంధంగా యాంటీబయోటిక్స్‌ కూడా ఇస్తుంటారు. ఆ డోసేజ్‌ ఎంతవరకు ఇవ్వాలన్నది కీలకం.

 

అది తెలియకపోయినా.. తరచూ అలా అధికంగా మందులు వాడినా... పిల్లల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆ యాంటీబయోటిక్స్‌ వల్ల శరీరానికి అవసరమైన బ్యాక్టీరియా కూడా మరణించి, ఇతర రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: