అరోగ్యంగా ఉండడానికి పండ్లు , కూరగాయలు తినడం మంచిదని అందరికి తెలిసిందే.. వాటితో అరోగ్యకరమైన ప్రయోజనాలు అనేకం. కొన్ని క్రానిక్‌ జబ్బుల మీద ఇవి టానిక్‌లా కూడా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. పండ్లలో సహజంగానే ఫ్యాట్‌, సోడియం, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ ఉండదు. ఎన్నో అతిముఖ్యమైన పోషకాలు పండ్లలో ఉంటాయి. పొటాషియం, డైటరీ ఫైబర్‌, విటమిన్‌- సి, ఫోలిక్‌ యాసిడ్లు పండ్లలో ఎక్కువగా ఉంటాయి. అందుకే పండ్లు తినండి... ఆరోగ్యాన్ని పెంచుకోండి అని డాక్టర్లు చెబుతుంటారు. 

 

అలాగే బరువు తగ్గాలన్నా.. రోగనిరోధక శక్తి పెరగాలన్నా పండ్లు తినాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు కొన్ని పండ్లు తప్పకుండా తినాలి. సీజనల్ పండ్లను తింటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు వైద్యులు. డయాబెటిక్స్ నుంచీ హార్ట్ పేషెంట్ల వరకూ, బీపీ ఉన్నవారు కూడా పండ్లను తినవచ్చు. ప్రతి రోజూ తినాలి కూడా. అయితే బరువు తగ్గిస్తాయి కదా అని పండ్లను ఎప్పుడు బడితే అప్పుడు తినకూడదు. దానికీ ఓ టైమ్ ఉందండోయ్‌. పండ్లను సరైన సమయంలో తింటే ఆ తర్వాత మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా, బరువు పెరిగే పరిస్థితి ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

 

ప్రతి రోజూ ఉదయాన్నే పండ్లను తినడం ద్వారా రోజును ప్రారంభిస్తే మంచిది. కానీ.. ఉదయం పూట పైనాపిల్, పుచ్చకాయ, బొప్పాయి లాంటి ఈజీగా జీర్ణం అయ్యే పండ్లను తినమంటున్నారు. ముఖ్యంగా భోజనం, ఫ్రూట్స్ ఒకే సమయంలో అరిగే పరిస్థితి ఉండదు. ఫ్రూట్స్ వేగంగా అరిగిపోతాయి. అందువల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల భోజనానికి ముందు, ఆ తర్వాత పండ్లను తినడం మంచిది కాదంటున్నారు. ఏదేమైనా పండ్లు తిన్న తర్వాత అరగంటపాటూ ఏమీ తినకపోవడం మంచిదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: