ఉరుకుల పరుగుల జీవితంతో... ఆరోగ్యం గురించి పట్టించుకునేవారే చాలా తక్కువ అయిపోతున్నారు. డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉరుకుల పరుగుల జీవితంతో ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం... ఇక ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించి సంపాదించిన డబ్బు ఆరోగ్యం కోసమే ఖర్చు చేయడం నేటి సమాజంలో జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం కనీసం కడుపునిండా తినడానికి కూడా టైం ఉండటం లేదు ఎవరికి.. అంతేకాకుండా సాంప్రదాయమైన ఇంటి వంటలు కంటే మసాలాలు దట్టించిన హోటల్  వంటలకే ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు నేటితరం జనాలు. ఎక్కువగా హోటల్ లో దొరికే మసాలాలు దట్టించిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండటంతో రోజు రోజుకి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతే ఉన్నాయి. 

 

 

 ఇక ఏ చిన్న సమస్య వచ్చినా... రసాయనాలతో తయారుచేసిన మందులనే వాడుతున్నారు ... మనం వేసుకునే ట్యాబ్లెట్లు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి  ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీస్తున్నాయి. అందుకే డాక్టర్లు ఎక్కువగా ఇంటి చిట్కాలను పాటించి... తరచూ వచ్చే దగ్గు జలుబు లాంటివి పోగొట్టుకోవచ్చు అని చెబుతుంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా టాబ్లెట్లు వాడటం వల్ల రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తోందని సూచిస్తున్నారు వైద్యులు. మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్ధాల తోనే మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మనకు అందుబాటులో ఉండే లవంగాలను వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. 

 

 

 ఇంతకీ లవంగం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాలను నీటిలో ఉడకబెట్టి... ఆ నీటిని తాగితే గుండె మంట నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా లవంగం గ్యాస్ట్రిక్, వికారం సమస్యలకు కూడా చెక్ పెట్టేస్తుంది. ఇక లవంగాల రసం మింగితే ఎలాంటి దగ్గు అయిన  మటుమాయం కావాల్సిందే. రోజు లవంగాలను నోట్లో వేసుకొని నమిలితే నోటి దుర్వాసన కూడా దరిచేరదు. గ్లాసు పాలలో చిటికెడు లవంగాల పొడి కాస్త ఉప్పు వేసుకొని తాగితే క్షణాల్లో తలనొప్పి మాయం అయిపోతుంది. లవంగం నూనెతో మసాజ్ చేస్తే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.ఇలా మనకు అందుబాటులో ఉండేలా లవంగం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: