క్యాన్సర్ గతంలో ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఇప్పుడిది ప్రాణాంతక వ్యాధిగా తయారైంది. ఏటా దీని బారిన కోట్ల మంది పడుతుతున్నారు. మన జీవనశైలితో పాటు మనం తీసుకునే ఆహారం ఈ వ్యాధికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా క్యాన్సర్‌ ను చాలా వరకూ నిరోధించుకోవొచ్చు. వీటిలో ముఖ్యంగా చేప‌లు. శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఆరోగ్యవంతమైన ఆహారాల్లో చేపలు కూడా ఒకటి. ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన మరియు ఆవశ్యక పోషకాలతో లోడ్ చేయబడి ఉంటాయి. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అత్యావశ్యక పోషకాల యొక్క అత్యుత్తమ వనరుల్లో చేపలు కూడా ఒకటి.

 

అయితే భారతదేశం చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నా...వాటిని ఆహారంగా తీసుకోవడంలో మాత్రం చాలా వెనుకబడిపోయాము. సాధార‌ణంగా ఏడాదికి ఒక మనిషి సుమారుగా 17 కేజీల చేపలు తినాల్సి ఉండగా..కేవలం 6 కేజీలకే పరిమితమవుతున్నాడు...అసలు సంవత్సరం పొడవునా తినని వారు కూడా ఉన్నారు. కాని, .చేపలను వారంలో మూడు సార్లు ఆహారంగా తీసుకుంటే..క్యాన్స్‌ర్ కు చెక్క పెట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

 

వారంలో ఒకసారి చేప వంట పదార్ధాలను తీసుకునే వారికంటే.. వారంలో మూడు సార్లు తినే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12 శాతం తక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా నూనె శాతం ఎక్కువగా ఉండే చేపలకు బదులుగా మిగతా చేపలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మొదలైన అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో చేప‌లు అద్భుతంగా సహాయపడుతాయ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: