సాధార‌ణంగా చాలా మంది చిరుతిళ్లు, ఆరోగ్యానికి మంచిదికాని ఆహారాన్ని తగ్గించుకోవాలని, వారాంతంలో వ్యాయామం చేయాలని, ఇలా వివిధ తీర్మానాలు చేసుకొంటుంటారు. అయితే చిరుతిళ్లు ఎంత మంచివో, అంత ప్రమాదం కూడా. పాఠశాల నుంచి వచ్చిన చిన్నారి, విధుల్లో నుంచి వచ్చిన ఉద్యోగి, పొలం నుంచి వచ్చిన రైతు ఇలా ఎవరైనా చిరుతిళ్లు తినేందుకు ఇష్టపడనివారు ఉండరంటే అతిశయోక్తికాదు. అలాంటి చిరుతిళ్లు తినే క్రమంలో ప్రస్తుతం అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫాస్ట్‌ఫుడ్స్‌ పేరుతో నూడిల్స్‌, సమోసాలు, బర్గర్లు, ఇతర జంక్‌ఫుడ్స్‌ తినడంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

 

తినే స్నాక్స్ సరైనవి కాకపోతే, ఆరోగ్యాన్ని దెబ్బతియ్యడమే కాదు... డైట్ కంట్రోల్ తప్పుతుంది కూడా. పైగా స్నాక్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే కాస్త జాగ్ర‌త్త తీసుకోవాలి. అయితే ఏ స్నాక్స్ తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. తృణధాన్యాలు, నవధాన్యాలూ మనకు ఎంతో మంచివి. వరి, గోధుమ, రాగి, నువ్వులు, మినుములతో తయారు చేసిన ఆహార పదార్థాల్లో పోషక విలువలు ఎక్కువగా ఉండి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. మ‌రియు వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది మనకు త్వరగా ఆకలి వెయ్యకుండా చేస్తుంది. 

 

సాల్ట్ చిప్స్ తినే కంటే వీటిని తినడం ఎంతో మేలు. ఉడ‌క‌బెట్టిన గుడ్డులో సరైన ప్రోటీన్లు, ఫ్యాట్స్ ఉంటాయి. కొంత కార్పొహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. కాబ‌ట్టి.. గుడ్లను స్నాక్స్‌గా తీసుకుంటే చాలా ఉత్త‌మం. అలాగే డార్క్ చాకొలెట్లలో షుగర్, మిల్క్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాని, దాదాపు 70 శాతం డార్క్ చాకొలెట్లు ఒక్కొక్కటీ 150 కేలరీల ఎనర్జీ ఇవ్వడమే కాకుండా వాటిలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సో.. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే చాలా మంచిది. మ‌రియు ఫ్రూట్స్‌ను కూడా స్నాక్స్‌లా తీసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: