ఈ మధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కనీసం ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే పట్టించుకునేవారే కరువయ్యారు. ఇక ఇప్పటి ఉద్యోగాలు కూడా ఒకేచోట కూర్చుని గంటలు గంటలు గడిపేల  ఉండడంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. అంతేకాకుండా ఎక్కువగా మసాలా దట్టించిన ఆహారాలను ఇష్టపడుతూ తినడం ఆరోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల అధిక బరువు పెరిగిపోతారు. ఇక బరువు పెరగడం తేలికే కానీ తగ్గించుకోవడమే చాలా కష్టతరమైన పని అని ఆ తర్వాత అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు. తమ బరువును తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కక నిరాశ చెందిన వారు ఎంతోమంది. 

 

 

 ప్రస్తుతం అధిక బరువు పెరుగుతున్న వారి కోసం కొత్తగా కొన్ని ట్రీట్మెంట్ సెంటర్ లు కూడా రావడం... వాటికి జనాలు ఆకర్షితులై లక్షలు లక్షలు ఖర్చు చేస్తూ ఉండటం లాంటివి కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే రోజువారీ వ్యాయామం చేయకపోవడం సరైన ఆహారం తగిన మోతాదులో తీసుకోకపోవడం... ఒకే దగ్గర కూర్చొని గంటలు గంటలు పనిచేస్తూ ఉండటం వల్ల అధిక బరువు పెరిగి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం కేటాయించే సమయం ఉండడం లేదు ఎవరికి. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. 

 

 అయితే కొందరు జన్యుపరంగా అధిక బరువు పెరుగుతూ ఉంటారు. అయితే అధిక బరువును తగ్గించుకోవడానికి చేయాల్సినవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

 

 వ్యాయామం :  వ్యాయామం అనగానే ఎంతో మందికి బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది కానీ వ్యాయామం చేయకుండా సరైన ఆరోగ్యం మాత్రం ఉండదు అనేది అందరికీ తెలిసిన నిజం. అయితే వ్యాయామం చేస్తున్న సమయంలో నిపుణులను సంప్రదించి తగిన ఆహార జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా బరువు తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటుంది. 

 

 

 ఆహారం : రోజు ఆహారాన్ని ఇష్టమొచ్చినట్లుగా తినకుండా కేవలం మనం రోజూ తీసుకునే ఆహారం 1200 నుంచి 1400 కేలరీల కు మించకుండా ఉండేలా చూసుకోవాలి. ఇక అల్పాహారంగా ఏది పడితే అది తినకుండా మొలకెత్తిన గింజలను, కీరదోస టమోటా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బచ్చలి కూర కాస్త నిమ్మరసం కలిపి సలాడ్స్  తీసుకోవాలి. కమలం,  ఖర్జూర,  జామ అలాంటి పండ్లను తరచూ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా రాత్రి భోజనం ఎనిమిది గంటలకల్లా పూర్తి చేసుకొని పది నిమిషాలు పాటు నడవాల్సి ఉంటుంది. 

 

 అంతే కాకుండా బరువు తగ్గాలి అనుకునే వారు వ్యాయామం నడక లాంటివి చేస్తూనే ఆహార నియమాలను పాటించి సరైన నిద్ర పోవడం వల్ల బరువు తగ్గడానికి వీలు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: