ఆయుర్వేద చరిత్రలో వాగ్బాటాచార్యుల వారికి చాలా గొప్పస్థానం ఉన్నది. వారు తెలియచేసిన  భోజనపద్ధతి. మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. ఈ మోతాదు జఠరాగ్నిని వృద్ది చెందించును. తినగలిగి నంతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను .పావు భాగము ద్రవపదార్థం అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. ఈ ఖాళీ భాగములో జఠరాగ్ని సంచరించి జీర్ణము కావించును 

తిన్నవెంటనే నీళ్ళు త్రాగడం కూడదు ఎందుకంటే జఠారాగ్నిని చల్లార్చును గంట తరువాత త్రాగిన జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టును. తక్కువుగా భుజించకూడదు. మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత, పిత్తాలను ప్రకోపింపచేయును . త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు.

పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం , కడుపుబ్బరం కలిగించునవి , సరిగ్గా పక్వము కానివి , గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి , అశుచిగా ఉండునవి , దాహాన్ని అధికము చేయునవి,  ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి , మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. శోకం , కోపం , భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.


  భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు . మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు , వాత,పిత్త,కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు , త్రేన్పులు లేనప్పుడు , బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు , జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను.

ఆయుర్వేదం  "ఏకకాల భోజనే మహాయోగి , ద్వికాల భోజనే మహాభోగి , త్రికాల భోజనే మహా రోగి " అని దీనినిబట్టి చూడవచ్చు ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో.  నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: