మనకు కడుపు నొప్పి ఎప్పుడు వస్తుంది ? శరీరంలో వాతం పెరిగిపోయినప్పుడు కొందరికి తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటుంది. ఒకొక్కసారి అన్నం తినగానే కడుపంత నొప్పిగానే ఉంటుంది. అయితే ఈ కడుపు నొప్పికి అల్సర్ ఏర్పడటం కూడా వీటికి ముఖ్య కారణం.. అయితే ఈ చిట్కాలు పాటించండి. 

 

మందార మొక్కవేర్లను నీటిలో శుభ్రం చేసి బాగా ఎండబెట్టాలి. ఆ ఎండిన వేర్లను పొడి చేసి భద్రపరిచి కడుపునొప్పి మొదలైనప్పుడు అరచెంచా పొడిని గ్లాసు పాలలో వేసుకుని రెండు పూటలా తాగుతుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది.

 

కొందరికి, అతిగా తినడం వల్ల అజీర్తి కారణంగా కూడా కడుపు నొప్పి రావచ్చు. వీరు... కొంచెం జీలకర్ర గానీ, వాము గానీ, నమిలితే ఉపశమనం లభిస్తుంది. 

 

పెసర గింజంత ఇంగువ మింగినా కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూను తేనె వేసుకుని తాగినా కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

అర చెంచా శొంఠి పొడిని ప్రతి అరగంటకు ఒకసారి వేడినీటిలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఉల్లిపాయను ముక్కలుగా కోసి, ఉప్పు అద్దుకుని తిన్నా నొప్పి పూర్తిగా తగ్గుతుంది. 

 

చూశారుగా... ఈ సహజ చిట్కాలు పాటించి కడుపునొప్పికి పోగుట్టుకోండి.. అప్పటికి తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: