ఒక బిడ్డ ఎదుగుదల అనేది కష్టమైన మరియు నిరంతరం కొనసాగుతూ ఉండే ప్రక్రియ. పిల్లలు శారీరకంగా మాత్రమే ఎదిగితే సరిపోదు మానసికంగా కూడా ఎదగాలి. తల్లిదండ్రులు పిల్లలు వయస్సుకు తగిన విధంగా ఎదుగుతున్నారా...? లేదా...? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు ఒకే వయస్సు పిల్లలు అయినప్పటికీ ఇతర పిల్లలు ఆ పనులు చేస్తున్నారని మన పిల్లలు ఆ పనులు చేయటం లేదని బాధ పడుతూ ఉంటారు. 

 

పిల్లలు మాట్లాడే మాటలు, తెలివితేటలు వయస్సుకు తగిన విధంగా మారుతున్నాయా...? లేదా...? అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏమైనా పిల్లలలో సమస్యలుంటే చైల్డ్ డెవల్ప్మెంట్ అసెస్మెంట్ ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను విశ్లేషించి పిల్లల ఎదుగుదల సరైన రీతిలో జరుగుతుందా...? లేదా..? ఏ అంశాలలోనైనా పిల్లలు వెనుకబడి ఉన్నారా..? తెలుసుకోవడమే చైల్డ్ డెవల్ప్మెంట్ అసెస్మెంట్. 

 

పిల్లలు పుట్టినప్పటి నుండి 3 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు చాలా కీలకమైన సమయం అని చెప్పవచ్చు. ఈ వయస్సులోని పిల్లలకు చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ చాలా ముఖ్యమని చెప్పవచ్చు. 5సంవత్సరాల వయస్సు పిల్లల వరకు చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ ద్వారా పిల్లలలో ఉండే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ కొంతమంది స్పెషల్ కిడ్స్ కు మాత్రమే అని అనుకుంటారు కానీ చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ సాధారణ పిల్లలకు కూడా ఎంతో అవసరం. 

 

పిల్లలు ఏ అంశంలోనైనా వెనుకబడి ఉన్నారా...? అని తెలుసుకోవడంలో చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. అయితే ఇంకా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ గురించి ఏమైనా తెలుసుకోవాల్సి ఉంటే పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మా పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ నెంబర్ 9100181181.













 






మరింత సమాచారం తెలుసుకోండి: