వాయిస్ అసెస్మెంట్ గురించి తెలుసుకుందాం.. వాయిస్ అసెస్మెంట్ మీ స్వరం ప్రస్తుతం ఎలా ఉంది ? ఎంత బాగుంది.. ? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా.. ? ఎటువంటి ప్రాబ్లం ఉంది.. ? దాని తీవ్రత ఎలా ఉంది ? అని తెలుసుకోవడానికి ఈ అసెస్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వాయిస్ అసెస్మెంట్ ఏ వయసు వారికైనా చేయవచ్చు.. ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ మనం గుర్తించగలం.

 

 

స్కూల్ లో, ప్లే గ్రౌండ్ లో పిల్లలు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ పిల్లల అల్లరిని.. వారి వాయిస్ డామినేట్ చేయడానికి పిల్లలు గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. అటువంటి సందర్భంలో వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్కూల్ పిల్లలే కాదు కాలేజీ పిల్లల్లోనూ, హోమ్ మేకర్స్ కూడా వారి పిల్లలను కంట్రోల్ చెయ్యడానికి అరుస్తూ ఎక్కువసార్లు తమ వాయిస్ పెంచుతూ ఉంటారు. అటువంటి సమయంలో కూడా వారి వాయిస్ పాడవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. 

 

అయితే మరి కొంతమందికి డెలివరీ తర్వాత వాయిస్ ఛేంజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అది హార్మోనల్ ఇన్ బ్యాలన్సు వల్ల జరుగుతూ ఉంటుంది. ఇంకొద్దిమందికి ఎక్కువ పొల్యూషన్ కి తిరగటం వల్ల, వేరే వేరే కారణాల వల్ల, మైక్ ఉపయోగించకుండానే గట్టిగా అరిచి మాట్లాడటం వల్ల వాయిస్ పాడవుతుంది. ఇటువంటి వారందరికీ కూడా వాయిస్ అసెస్మెంట్ చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. 

 

ఉదయం లేవగానే వాయిస్ పూర్తిగా డౌన్ అయిపోతుంది.. ఇటువంటి లక్షణాలు.. మరి కొన్ని లక్షణాలు.. అవి ఏంటి అంటే.. మీడియం రేంజ్ లో మాట్లాడేవారు ఎప్పుడైతే గట్టిగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారో అప్పుడు చాలా పెయిన్ కలుగుతుంది అని చెప్తుంటారు.. థ్రోట్ పెయిన్ తరచూ రావడం.. గట్టిగా మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి పెయిన్ రావడం.. ఆ తర్వాత ఏదైనా పదార్ధం మింగేటప్పుడు నీళ్లు అయినా.. సాలిడ్స్ అయినా మింగుతున్నప్పుడు పెయిన్ వస్తే అది కూడా గమనించాల్సిన విషయమే.. 

 

అయితే ఈ వాయిస్ అసెస్మెంట్ లో భాగంగా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను స్పీచ్ లాంగ్వేజ్ మేథాలజిస్ట్ ను అడిగి తెలుసుకోండి. వివిధ సందర్భాల్లో మీ వాయిస్ ఎలా ఉంది.. మీ వాయిస్ లో ఏ రకమైన ప్రాబ్లెమ్ ఉంది.. క్వాలిటీ అఫ్ వాయిస్.. లౌడ్ నెస్ అఫ్ వాయిస్.. ఇలా వివిధ రకాల అనాలసిస్ చేసుకొని.. అసలు మీకు ప్రాబ్లమ్ ఉందా.. లేదా? ఉన్నట్లయితే దీనికి కారణం ఏమిటి? అనేది తెలుసుకొని డయాగ్నోసిస్ చేయించుకోవడం మంచిది. 

 

ఆతరవాత ఇంటోవెన్షన్ వాయిస్ థెరపీ ద్వారా మీ వాయిస్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? ఎన్నాళ్ళు పడుతుంది అనే విషయాలు అన్ని కూడా మీకు తెలియచేస్తారు. అసలు ఆ థెరపీ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే దీనికి సర్జరీ అవసరమా.. లేకపోతే మీరు వేరే ప్రొఫెషనల్స్ ను కలవాల్సి ఉంటుందా? ఇటువంటి విషయాలు అన్ని కూడా బేసిక్ వాయిస్ అసిస్మెంట్ చెయ్యడం వల్ల బయట పడుతాయి. 

 

అందుకే మీకు ఏదైనా చిన్న వాయిస్ ప్రాబ్లెమ్ ఉన్న సరే దాన్ని నెగ్లెట్ చెయ్యకండి. చిన్న ప్రాబ్లెమ్ కూడా నిర్లక్ష్యం చెయ్యడం వల్ల పెద్దగా మారిపోతుంది. అప్పుడు ఆ సమయ్సలు పరిష్కరించడం చాలా కష్టం అవుతుంది. అందుకే మీ వాయిస్ ప్రాబ్లమ్ 10 నుండి 15 రోజుల వరుకు అలాగే కొనసాగితే దాన్ని గమనించాల్సి ఉంటుంది. కోల్డ్ వచ్చినపుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం వాయిస్ మారడం పెద్ద ప్రాబ్లెమ్ ఏమి కాదు.. కానీ ఈ వాయిస్ చేంజ్ 10 రోజులకు మించి అలాగే కొనసాగినట్లయితే ఆ లక్షణాలను మీరు గుర్తించి వాయిస్ థెరపిస్ట్ ని కలవడం ఎంతో మంచిది. అయితే ఇంకా ఈ వాయిస్ అసెస్మెంట్ గురించి ఏమైనా తెలుసుకోవాల్సి ఉంటే ఈ పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మా పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ నెంబర్ 9100181181.









 

మరింత సమాచారం తెలుసుకోండి: