ఈరోజుల్లో సిగరెట్ తాగడం వ్యసనం కాదు అదో స్టైల్ గా మారిపోయింది. సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పని చేయకుండా పాడవుతాయి అని తెలుసు. సిగరెట్ తాగడం వల్ల ఆయుష్షు తగ్గి  తొందరగా చనిపోతామని తెలుసు. సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ వచ్చి  బతుకు దుర్భరం అవుతుంది అని అందరికీ తెలుసు. కానీ సిగరెట్ తాగడం మాత్రం ఎవరు మారరు. ఈరోజుల్లో సిగరెట్ తాగడం ఒక వ్యసనం అయిపోయింది అనడంకంటే ఒక మోడ్రన్ స్టైల్  అయిపోయింది అనడంలో సందేహం లేదు. రోజురోజుకు సిగరెట్ తాగే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక ఒక్కసారి సిగరెట్ తాగడం మొదలు పెట్టారు అంటే ఆ తర్వాత మానేయడం మాత్రం ఎవరి తరము కాదు. సిగరెట్ మానేయడానికి ఎన్నో తంటాలు పడాల్సి ఉంటుంది. సిగరెట్ మాన్పించడానికి కొన్ని కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కొన్ని ప్రొడక్ట్ అమ్ముతూ బిజినెస్ కూడా ప్రారంభించాయంటే  సిగిరెట్టు ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. హాయిగా సాగిపోతున్న నిండు జీవితానికి సిగరెట్ మసకబారేలా  చేస్తుంది. 

 

 

 ఇక సినిమా థియేటర్లో నా పేరు ముఖేష్... అని ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పటికీ ఎవరి లో మార్పు మాత్రం రావడం లేదు.సిగరెట్ తాగడం అనేది ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే అలవాటు.... కానీ ఇప్పటి తరంలో మాత్రం సిగరెట్ తాగడం ఒకటి ట్రెండ్  అయిపోయింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న  పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ సిగరెట్ తాగేస్తున్నారు. అది కూడా అప్పుడో  ఇప్పుడో  ఒకటి తాగడం కాదు ఏకంగా ఒక్కరోజులో సిగరెట్ ప్యాకెట్ మొత్తం తాగేస్తున్నారు. మరీ అంతలా తాగితే రోగాలు రాకుండా ఉంటాయి  చెప్పండి. ఇంకొంతమంది సిగరెట్ మానేయాలని ఉన్నప్పటికీ అది మానడం ఎలాగో తెలియక... సిగరెట్ తాగడం కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇలా ఉంది ప్రస్తుతం సమాజంలో పరిస్థితి. 

 

 

 సిగరెట్ లో వుండే నికోటిన్ వారిలో ఒక చైన్ లాంటి  ఎఫెక్ట్  ఏర్పరుస్తుంది. బాడీ లో ప్రవేశించిన నికోటిన్ ప్రభావం తగ్గగానే మరో సిగరెట్ తాగాలనిపిస్తుంది సిగరెట్ అలవాటు ఉన్నవారికి.. కావాలన్నప్పుడు సిగరెట్ దొరకకపోతే మాత్రం పిచ్చెక్కి  పోతూ ఉంటారు. రోజు  ఆహారం తినకుండా నైనా ఉంటారేమో కానీ సిగరెట్ తాగకుండా మాత్రం అస్సలు ఉండలేరు. అయితే సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా సిగరెట్ పొగతో నిండిపోయింది ఉంటుంది. దీంతో రోజురోజుకు సిగరెట్ తాగే కొద్దీ లంగ్స్  నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా రోజూ వ్యాయామం చేసే వారికి సిగరెట్ తాగే అలవాటు ఉంటే.. ఎప్పుడు ప్రాణాల మీదికి వచ్చేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సిగరెట్ తాగని వాళ్ళు వ్యాయామం చేస్తున్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి 30 శాతం ఎక్కువగా ఆక్సిజన్ విడుదల అవుతూ ఉంటుంది... అదే సిగరెట్ తాగేవాళ్ళ లో మైనస్ 30 శాతం ఆక్సిజన్ విడుదల అవుతుంది. ఇలాంటి వాళ్లు వ్యాయామం చేస్తూ ఉంటే సరైన ఆక్సిజన్ అందక గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే సిగరెట్  ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: