ప్రస్తుతం ప్రజలు ఏ విషయానికి అయినా వణికిపోతున్నారు అంటే.. అది కరోనా వైరస్ కే.. అప్పుడప్పుడు ప్రజలు బెదిరగొట్టడానికి సంవత్సరానికి ఓ కొన్ని వైరస్ లు వెలుగులోకి వస్తూ ఉంటుంది... అలానే ఈ సంవత్సరం మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ కరోనా వైరస్ చైనాలో ప్రజలను ఇప్పటికే బెదర కొట్టేసింది.. 

 

అతి వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరొనా వైరస్ గురించి వైద్య నిపుణులు ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నారు. కరొనా అనే క్రిమి ద్వారా వ్యాపిస్తున్న ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవగాహన ఉండాలి..  అందుకే ఇక్కడ ఉన్నవి చదివి జాగ్రత్త పడండి. 

 

కరొనా వైరస్ అనేది కొన్ని వైరస్‌ల సమూహం అని చెప్పొచ్చు. ఇది కొన్ని కరొనా వైరస్‌లు జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్‌లు మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. 

 

ఈ కరోనా వైరస్ వచ్చింది అంటే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఈ వైరస్ లో ప్రాణాంతక క్రిములు ఎన్నో ఉంటాయి.

 

కరొనా వైరస్ వ్యాపించడానికి గల కారణాలు ఇవే..

 

ఈ వైరస్ సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి వ్యాపిస్తుంది.

 

ఈ వైరస్ దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.

 

శారీరక సంబంధం ఉన్న ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

 

వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా ఈ వైరస్ వ్యాపిస్తుంది.

 

వైరస్ లక్షణాలు ఇవే.. జలుబు, తలనొప్పి, దగ్గు, మోకాలి నొప్పులు, జ్వరం పూర్తిగా అనారోగ్య పాలవడం.. ఇవే ఈ వైరస్ లక్షణాలు. అందుకే ఈ వైరస్ వచ్చింది అనేది ఈ లక్షణాలు బట్టి తెలుసుకోవాలి. 

 

ఈ కరోనా డిసీజ్ వస్తే.. న్యూమోనియా వంటి అనేక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆ ఒక్కటే కాదు.. కఫంతో కూడిన దగ్గు ఉంటుంది, ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారుతుంది, ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది, గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది, రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.. 

 

ఫైనల్ గా మీకు చెప్పేది ఒకటే.. ఏది తినాలి అన్న జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.. ఫేస్ కు మంచి నాణ్యమైన మాస్కులు వేసుకోండి.. చేతులను ఒకటికి రెండుసార్లు కడుకోండి.. అంతేకాదు.. కొద్దికాలం పాటు నాన్ వెజ్ తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: