కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోందీ వైరస్. ఇటీవల చైనాలో విశ్వరూపం చూపిస్తోంది. చైనాలో ఈ వైరస్ బారినపడిన ఇప్పటివరకూ 17 మంది చనిపోయారు. చివరకు ఈ వైరస్ కారణంగా చాలా దేశాలు తమ పౌరులను చైనా వెళ్లొద్దని కూడా చెబుతున్నాయి.

 

అయితే అలా చైనాలో ప్రబలి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాకూ వచ్చేసింది. ఓ కేరళకు చెందిన నర్స్ కు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ చెప్పారు. జెడ్డాలోని ఆల్ -హయత్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కేరళకు చెందిన 100 మంది నర్స్ లను పరీక్షించారు. వీరిలో ఒకరికి ప్రాణాంతక కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత నర్స్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందట. దీంతో అప్రమత్తమైన భారత్ చైనా నుంచి వచ్చే ప్రయాణిలను థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏడు విమానాశ్రయాల్లో ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకూ చైనా నుంచి వచ్చిన 60విమానాలకు చెందిన దాదాపు 13వేల మందిని స్క్రీనింగ్ చేసారు. వీరిలో ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: