హైబీపీ అనేది నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ది. గుండెకు రక్తం సరఫరా అయ్యే రక్తనాళాల్లో ఎల్లప్పుడూ పీడనం ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ అంటారు. సాధారణం 140/90 కంటే ఎక్కువ ప్రెషర్ ఉండడాన్నే హైబీపీ అంటారు. మ‌రియు 180/90 ఉంటే అనారోగ్య సమస్యలు త‌లెత్తుతాయి..  అందుకే.. అలాంటి పరిస్థితి రాకముందే బీపీ కంట్రోల్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు. 

 

ముఖ్యంగా నీటిశాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయని తీసుకోవడం వల్ల హైబీపీని ఈజీగా కంట్రోల్‌లో పెట్టుకోవ‌చ్చు.  పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. ఈ కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సో.. హైబీపీ ఉన్న‌వారు ఖ‌చ్చితంగా పుచ్చ‌కాయ తిన‌డానికి ట్రై చేయండి. అంతేకాకుండా పుచ్చకాయ కడుపు నింపుతుంది, దాహం తీరుస్తుంది, కానీ బరువు పెరగనివ్వదు. ఇందులో పొటాషియం ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 

పుచ్చకాయలోని బి1, బి6, సి విటమిన్లు , మాంగనీస్‌ వంటి మైక్రో న్యూట్రియెంట్స్‌ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుచ్చకాయలోని సిట్రులైన్, ఆర్గినైన్ పదార్దాల వలన మగవారిలో అంగస్తంభన సమస్య తగ్గుతుంది. ఇది ఒక నేచేరల్ వయాగ్రాలా పనిచేస్తుంది. మ‌రియు పుచ్చ‌కాయ‌ శరీరంలోని విషపదార్ధాలను బయటకు పంపిస్తుంది. దాంతో మూత్రపిండాలు తేలికవుతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: