మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ నీటి ద్వారానే వస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం లేదు. పర్సనల్ గా వాటర్ బాటిల్ మెయింటైన్ చేస్తున్నారు. బయటకు వెళ్లినా ఓపెన్ గా లభించే నీరు తాగడం లేదు.

 

వాటర్ బాటిల్ కొనుక్కుని తాగుతున్నారు. అయితే.. ఇప్పుడు మార్కెట్లోకి ఓ కొత్త వాటర్ బాటిల్ వచ్చింది. దీని రేటు ఏకంగా 100 రూపాయలు. ఏవీ ఆర్గానిక్స్ అనే గుజరాత్ కు కంపెనీ ఈ నలుపు నీటిని రూపొందించింది. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఖనిజాలు, లవణాలు ఈ నీటిలో ఉంటాయట. దాదాపు 70కి పైగా సహజ సిద్ధమైన ఖనిజాలు ఈ నలుపు నీటిలో ఉన్నట్లు ఏవీ ఆర్గానిక్స్ కంపెనీ చెబుతోంది.

 

ఆ నీళ్లు ఎక్కడివో తెలుసా.. నర్మదా నదిలోని నీటిని సేకరించి శుద్దీకరణ తర్వాత ఎంపిక చేసిన మేలైన ఖనిజాలు, లవణాలను కలపటం వల్ల నీటికి నలుపు రంగు వస్తుందట. ఆసక్తికరంగా నలుపు రంగు నీళ్లను ఏవోకస్' అనే బ్రాండు పేరుతో ఒక సంస్థ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: