ఈ మధ్య కాలంలో మధుమేహం వ్యాధితో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిజానికి మన శరీరానికి వచ్చే చాలా రోగాలను వంటల్లో ఉపయోగించే పదార్థాలను వాడి తగ్గించుకోవచ్చు. షుగర్ వ్యాధితో బాధ పడేవారు మెంతులను ఉపయోగించటం ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషక పదార్థాలు మెంతుల్లో ఉన్నాయి. 
 
మెంతులలో శరీరానికి అవసరమైన పోషకాలు బి1, బి2, సి విటమిన్, పీచు పదార్థాలు ఉంటాయి. ప్రతిరోజూ మెంతులను తీసుకోవడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువు సమస్యతో బాధ పడేవారు పెరుగులో మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినటం వలన శరీరంలోని కొవ్వు సులభంగా కరిగిపోతుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా మెంతులను ప్రతిరోజూ తినటం వలన తగ్గుముఖం పడతాయి. 
 
మెంతులను నీటిలో నానబెట్టి రోజూ తాగితే షుగర్ సమస్య తగ్గుతుంది. షుగర్ తో బాధ పడేవారు ప్రతీరోజూ నీటిలో నానబెట్టిన మెంతులను తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. బాలింతలు మెంతులతో కూడిన కషాయం 
తాగటం వలన పాలు బాగా పడతాయి. జుట్టు ఊడిపోతుందని బాధ పడే వారు మెంతి ప్యాక్ వేసుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మెంతి ఆకులను పేస్ట్ లా చేసుకొని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: