నీటిని మించిన ఔషధం మరోటి లేదంటారు. మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగమని చెబుతుంటారు. అస‌లు ఆహారం లేక‌పోయినా ఉండొచ్చేమో గాని.. నీరు లేకుండా బ్ర‌త‌క‌లేమ‌న్న‌ది వాస్త‌వం. మనిషి హైడ్రేటెడ్ గా ఉండాలన్నా.. అదనపు క్యాలరీలు బర్న్ చేయడానికైనా నీరు తాగాలి. అయితే నిల‌బ‌డి నీరు తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుంది..? నిలబడి నీరు తాగితే రోగాలు మీ వెంట వచ్చి నట్లే అంటున్నారు నిపుణులు. అందేంటీ నిలబడి వాటర్ తాగాతే రోగాలు ఎలా వస్తాయా.. అని అనుకుంటున్నారా.. ! అవును నిజం.

 

పరుగెత్తి పాలు తాగే బదులు.. నిల్చుని నీరు తాగడం మంచిది అంటారు. కానీ ఆ సామెత చెప్పిన పెద్దలే నిలబడి నీళ్ళు తాగడం శరీరానికి అంత మంచిది కాదు అని కూడా చెప్తుంటారు. కానీ సహజంగానే మనం తేలిగ్గా తీసుకుంటాము, అదేమీ అంత పెద్ద విషయం కానట్లు.  ఇప్పుడు నిలబడి నీరు తాగడం మంచిది కాదు అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఎందుకుంటే నిలబడి తాగిన నీరు ఒక్కసారిగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. దీంతో.. అజీర్తి, అసిడిటీ ఇతర సమస్యలు వస్తాయి. 

 

అంతేకాదందోయ్‌.. కిడ్నీలకు నీరు అందదు కూడా. ఇది మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీస్తాయి. నిలబడి నీరు త్రాగడం వల్ల‌ నీళ్ళు మూత్రపిండాల ద్వారా సరిగా వడకట్టబడవు. తద్వారా వ్యర్థపదార్ధాలు నేరుగా మన మూత్రపిండాలలోకి వెళ్లి రక్తంతో కలిసి, మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నిలబడి నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ద్రవాల సమతుల్యత దెబ్బతిని, కీళ్ళల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్, కీళ్ళవాతం వంటి సమస్యలకు దారితీస్తాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: