సంతానం లేక పోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. భార్య భర్త లలో ఎవరిలో లోపం ఉన్నా సంతానం కలగక పోవచ్చు. కేవలం లైంగిక కలయిక సంతృప్తికరంగా ఉన్నంత మాత్రాన సంతానం కలుగదు. పెళ్లి అయ్యాక రెండు ఏళ్ల పాటు కలిసి కట్టుగా కాపురం చేసినా గర్భం దాల్చక పోవటాన్ని సంతాన లేమిగా డాక్టర్లు చెబుతున్నారు.  యుక్త వయస్సులో ఉన్న దంపతుల్లో మూడు, నాలుగు సంవత్సరాల పాటు వేచి ఉండే ధోరణిని కూడా మనం గమనిస్తాం. అయినప్పటికీ కూడా గర్భం దాల్చకపోతే మాత్రం సంతానలేమి అన్న అనుమానం కలగక మానదు. ఇటువంటి పరిస్థితులలో… సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించి కృత్రిమ పద్ధతులలో నయినా సరే సంతానం పొందడానికి ప్రయత్నించాలి.

 

పురుషుడు తన వీర్య కణాలులో లోపాలు ఉన్నప్పుడు తన సోదరులు నుండి గాని, వరుసకు సోదరుల నుండి గాని, సగోత్రీకుల నుండి గాని వీర్య కణాలు సేకరించి కృత్రిమ గర్భ ధారణ చేయించి (టెస్ట్ ట్యూబ్ బేబీ) తన వంశం నిలుపుకోవచ్చు. ఈ విధం గా పుట్టిన సంతానాన్ని క్షేత్రజుడు అంటారు. శాస్త్రం అంగీకరిస్తుంది. ఈ పద్ధతులు లేని పూర్వ కాలంలో భార్యలు భర్తల అనుమతి తో లేదా పెద్దల అనుమతితో అయిన వారితో కలయిక ద్వారా సంతానం పొందే వారు. మహా భారతం లో వ్యాస మహర్షి ద్వారా ఈ పద్ధతి లోనే ధృత రాష్ట్రుడు, పాండురాజు లకు జన్మ నిచ్చారు వారి తల్లులు.

 

 ఆనాటి మను ధర్మ శాస్త్రం దీనిని అంగీకరించింది. అయితే కాలం తో పాటు ధర్మాలు కూడా మారతాయి. ఆ విధము గానే అయిన వారితో కలయిక ద్వారా సంతానంపొందాలనుకుంటే (భార్య భర్త లలో ఎవరైనా సరే) ఈ కాలం లో అది అధర్మం కిందే వస్తుంది. అక్రమ సంబంధాలకే దారి తీస్తుంది. కాబట్టి అయిన వారివలన సంతానం కలగాలంటే సంతాన సాఫల్యాల కేంద్రాల ద్వారా కృత్రిమ గర్భ ధారణ పద్ధతులు మాత్రమె పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: