అరటిపండు తినని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా చాలా మంది భోజన సమయంలో ఉపయోగిస్తారు. అది కూడా పెరుగు అన్నం తినే చివరి సమయంలో అరిటి పండు వాడుతారు. ఎందుకంటే తొందరగా అరుగుదల కలిగించడంలో అరటిపండు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించడంలో కూడా అరటిపండు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతేనా సౌందర్య సాధనంగా అరటిపండుని ఉపయోగిస్తారు మహిళలు. మరి అరిటిపండు తో టీ ఎలా పెడుతారు..?? దాని వలన కలిగే ఉపయోగాలు ఏమిటి..?? అనే విషయాలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..ఆ వివరాలలోకి వెళ్తే..

 

అరటిపండు టీ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రసాయనిక ఎరువుల ద్వారా పడిన అరటిపండు కాకుండా సహజసిద్దమైన అరిటిపండు తీసుకుని దానిని వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఆ తరువాత అరటిపండు తీసేసి ఆ నీటిని చల్లార్చి లేదా గోరు వెచ్చగా టీ తాగినట్టుగా త్రాగేయచ్చు. అరటిపండు తొక్కలో ఉండే ఫైబర్ మన శరీరానికి మరింత ఉత్తేజాని ఇస్తుంది. అంతేకాదు మానసిక ప్రశాంతత అరటిపండు టీ వలన కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

 

అలాగే ఈ టీ తయారు చేసేముందు తప్పకుండా తొక్క ముందు , వెనుక భాగాలు కత్తితో కట్ చేసి వేడి నీటిలో వేసి ఉడికించాలి. ఈ టీ త్రాగడం వలన మలబద్దక సమస్య కూడా రాకుండా ఉంటుంది. టీ చేసిన తరువాత మిగిలిన అరటిపండుని సౌందర్య సాధనాలు తయారీలో సైతం ఉపయోగించుకోవచ్చు. ఈ టీ వలన వ్యాధినిరోధక శక్తిని ఇచ్చే B6 మరింతగా పెరుగుతుంది. ఇకేం ఎంతో సింపుల్ గా తయారయ్యే ఈ అరటిపండు టీ ని మీరుకూడా ట్రై చేయండి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: