ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు అతి పెద్ద హాట్ టాపిక్ కరోనా వైరస్. ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్న ఎవరు మాట్లాడుతున్న ఈ వ్యాధి గురించి ఈ వైరస్ గురించి ఎక్కువ చర్చించుకుంటున్నారు. చైనాలో ఈ వ్యాధి కనుగొనడంతో ఒక మనిషి నుండి మరొక మనిషికి అంటువ్యాధిగా సోకుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రాకపోకలు ఆ దేశ ప్రభుత్వం నిలిపివేశారు. చైనాలో ప్వ్యూహాన్ నగరంలో ఈ వ్యాధి బయట పడటంతో అక్కడ చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు ఆసుపత్రులు స్పెషల్ గా ఈ వ్యాధి కోసం ఈ వైరస్ సోకిన వారి కోసం నిర్మాణం చేపట్టింది. ప్రపంచ దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాలు తమ దేశస్థులకు వీలైనంతవరకూ చైనా నగరానికి వెళ్లకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.  అంతేకాకుండా అన్ని దేశాల విమానాశ్రయాల దగ్గర ఈ వ్యాధిని గుర్తించే విధంగా వైద్య బృందాలు స్పెషల్ అలర్ట్ అయ్యాయి.

 

ఇక మన దేశానికి వస్తే ఇండియాలో ఈ వ్యాధి రాకుండా కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్ నగరంలో మరియు పూణే పట్టణంలో ఈ వ్యాధి బయట పడినట్లు వార్తలు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం విమానాశ్రయంలో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రతి విమానంలో నుండి దిగే ప్రయాణికులను ముఖ్యంగా విదేశీ ప్రయాణికులను పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 

కరోనా వైరస్ ఇప్పటికే సోకిన దేశాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ప్రత్యేక పరీక్షలు ఉంటాయని అధికారులు చెప్పారు. ఎంట్రీ ఎగ్జిట్ గేట్ల దగ్గర ప్రయాణికుల అవగాహన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. చైనా దుబాయ్ మలేషియా సింగపూర్ నుంచి నగరానికి వస్తున్న వారిని పూర్తిగా పరిశీలిస్తున్నామని వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే నగరం లోకి పంపుతునట్లు స్పష్టం చేశారు అధికారులు. దీంతో ఈ వార్త విన్న చాలా మంది మన ఇంటి దగ్గర కూడా ఈ వ్యాధి వచ్చేసిందే అని ఏపీ ప్రజలు బెదిరి పోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: