మనం ఎంత తిన్న.. ఎంత శక్తిని ఇచ్చేవి తిన్న చురుగ్గా ఉండలేం.. ప్రతి పని చురుగ్గా అసలు చెయ్యలేం.. అయితే మనం చురుగ్గా ఉండాలంటే ఎలాంటి పనులు చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఫిటినెస్ ను సాధించండి.. ఆ చిట్కాలు ఏంటి అంటే?

 

పోషకాహారం ఎక్కువ తీసుకోవాలి.. అంటే మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, చేప నూనె, అవిసెలు వంటి హెల్తీ ఫ్యాట్స్‌తో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి.

 

ఎన్ని సార్లు అయినా తినండి.. కానీ మూడు గంటలకు ఒకసారి చిన్న బౌల్ లో పెట్టుకొని తినండి.. అపుడే ఈజీగా శక్తి వస్తుంది. 

 

ప్రతి దాంట్లో పోషకవిలువలు ఉండేలా జాగ్రత్తపడండి. అంతేకాదు వ్యాయామాలకు శక్తిని ఇచ్చేలా ఆ పోషకాలు ఉండాలి.

 

ఆహారంలో క్యాలరీలు, ప్రొటీన్లు మెండుగా ఉండాలి. వీటివల్ల శరీరం దృఢంగా ఉంటుంది.

 

శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. 

 

వ్యాయామాలు చేసేటప్పుడు శరీరానికి ఎంతగా కదలికలు ఇస్తే కండరాలు అంత పటిష్టమవుతాయి.

 

శరీరంలోని కొవ్వు కరగాలంటే రోజూ తగినంత ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి. అలాగే క్యాలరీల తక్కువ ఉండేలా చూసుకోవాలి. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. శక్తివంతంగా తయారవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: