నిద్ర.. మనిషికి ఖచ్చితంగా 8 గంటలు నిద్ర ఉండాలి. ఒక గంట ఎక్కువ అయినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కాకూడదు. కానీ కొంతమంది ఈ రూల్స్ అన్నింటిని బ్రేక్ చేసేస్తారు. ఎంతలా బ్రేక్ చేస్తారు అంటే.. ఒకేసారి 15 గంటలు లేదా 12 గంటలు నిద్రపోయేంతలా బ్రేక్ చేస్తారు.. అయినా సరే వారికీ నిద్ర బాధ తప్పదు.. 

 

నిద్ర ఎంత తక్కువ పోవాలి అనుకున్న కుదరదు.. అయితే అలాంటి వారు అంత కొన్ని చిట్కాలు తప్పక పాటించండి.. నిద్రమత్తు యిట్టె వదిలిపోతుంది.. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నిద్ర వచ్చ్చిన రాకపోయినా 10 లేదా 11 గంటల సమయానికి అంత బెడ్ ఉండేలా చూసుకోండి. 

 

అనవసరంగా రాత్రిపూట టీవీ ఎక్కువ చూడటం, ఫోన్ వాడటం అసలు మంచిది కాదు. 

 

నిద్రలేవటానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు కానీ అది రాగానే ఆపేసి పడుకుంటారు దాని వల్ల ఫలితం ఏంటి ? అందుకే అలారం పెట్టిన ఫోన్ లేదా క్లాక్ ని కాస్త దూరంగా పెట్టండి. అప్పుడు అలారమ్ వస్తే అది ఆఫ్ చెయ్యడానికి అయినా మీరు బెడ్ దిగుతారు. ఆలా చెయ్యడం వల్ల నిద్ర వదులుతుంది.. 

 

అంతేకాదు.. మీకు అంటే మనకు ఎలాగో బద్ధకం అలవాటు అయితుంది. కానీ పిల్లలకు ఆలా అవ్వకూడదు అంటే చెప్పటం కాదు మీరు కూడా వారితో పాటు చెయ్యడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: