ఒక‌ప్పుడు మ‌న దేశం మీద‌కి ఉగ్ర‌దాడి ఉందంటే ప్ర‌భుత్వం అల‌ర్ట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ర‌క ర‌కాల జ‌బ్బులు వేరే దేశాల నుంచి మ‌న దేశాల‌కు వ‌చ్చే ప్ర‌మాదాలు ఎక్కువ‌యిపోయాయి. దీంతో ఈ విష‌యాల పైన కూడా ప్ర‌భుత్వం ఎంతో బాధ్య‌త‌తో అల‌ర్ట్‌గా ఉండాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కొన్ని జ‌బ్బుల పేర్లు విన‌డానికి కూడా విచిత్రంగా ఉంటున్నాయి. ఇక ప్ర‌స్తుతం దేశ‌మంతా హ‌డ‌లిపోయే కొత్త వైర‌స్ ఒక‌టి వ‌చ్చింది. దాని గురించి గ‌త ప‌ది రోజుల నుంచి చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇక ఆ వైర‌సే క‌రోనా వైర‌స్‌. ఇది అంద‌రిని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి అత్యంత వేగంగా వ్యాపిస్తోంద‌ట‌. ఈ వైర‌స్ సోకిన త‌ర్వాత వంద‌మంది చ‌నిపోగా... ఒక్క‌రోజులోనే ఏకంగా 50 మంది చ‌నిపోయార‌ని స‌మాచారం. దీన్ని వైర‌స్ వ్యాప్తి వేగం ఎలా ఉంద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చ‌ప్ప‌క్క‌ర్లేదు. 

 


ప్ర‌స్తుతం ఈ వైరస్ మ‌న భార‌త‌దేశంలోకి ప్రవేశించింది... దేశంలో ప్రస్తుతం ఒకరికి కరోనా వచ్చినట్లు కన్‌ఫామ్ అయ్యింది. మరొకరికి కూడా వచ్చినట్లుగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఈ ప్రకటనలతో... కేంద్ర ప్రభుత్వంతోపాటూ... అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ చాలా అలర్ట్ అయ్యాయి. అన్ని ఎయిర్‌పోర్టుల్లో థెర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ఐతే... ఈ వ్యాధి వచ్చిన రోగి తుమ్మినా, దగ్గినా పక్కవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం చాలానే ఉంద‌ట‌. అలాగే... రోగి వాడిన వస్తువులపై వైరస్ ఉంటుంది కాబట్టి... ఆ వస్తువుల్ని కూడా టచ్ చేసినా చాలు వైరస్ సోకే ప్రమాదం చాలానే ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక దీని బారి నుంచి ఎలా త‌ప్పించుకోవాలంటే...ప్రతీ ఒక్కరి ముందూ ఉన్న సమస్య. ప్రధానంగా ముక్కూ, నోటి ద్వారానే వైరస్ బాడీలోకి వెళ్తోంది కాబట్టి... ముందుగా ముక్కు, నోటికి మాస్కులు కచ్చితంగా ధరించాలి. అలాగే... బయట ప్రయాణించాక... ఇంటికి వచ్చి సబ్బుతో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి. వీలైతే స్నానం చెయ్యడం చాలా బెటర్. అంతేకాదు వీలైనంత వ‌ర‌కు ఎక్కువ మంది జ‌న‌తాకిడి ఉన్న రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడం బెటర్. అంతేకాదు... ఎవరైనా తుమ్మినా, దగ్గినా... వారికి కనీసం రెండు మీటర్ల దూరంలో ఉంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి మొహమాటం ప‌డ్డామా ఇంక అంతే సంగ‌తులు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే... ఆ వైరస్ సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఎంతైన ఉంది.

 


కరోనా వైరస్ సోకిన తర్వాత... 2 వారాల వ‌ర‌కు ఈ వ్యాధి గురించి మ‌నం గుర్తించ‌లేము.   అప్పటివరకూ ఈ వైరస్ బాడీలో ప్రవేశించి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పటివరకూ కరోనా వైరస్‌ని తగ్గించేందుకు వైధ్యులు చేసిన ఏ ప్రయత్నాలూ ఫలించలేదు. పైగా రోగుల సంఖ్య రోజు రోజుకి మ‌రింత రెట్టింపయ్యింది.

 


ఈ వైరస్‌కి తగిన మందు (వ్యాక్సిన్) తయారీకి కనీసం ఏడాది పట్టొచ్చని తెలుస్తోంది. అప్పటికైనా మందు తయారవుతుంది అన్న గ్యారెంటీ కూడా లేదంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ఒక వ్యక్తికి వస్తే... ఆ వ్యక్తి నుంచీ మరో 3 లేదా 4గురు వ్యక్తులకు వ‌చ్చే ప్ర‌మాదం ఎంతైన ఉంది.దీని పైన కేంద్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఇండియా ఈ వైరస్‌ని అడ్డుకోగలదన్న నమ్మకం దేశ ప్రజల్లో తక్కువగా ఉంది. చాలా మంది ఈ వైరస్ దేశంలో ఎక్కువగానే వ్యాపిస్తుందని నమ్ముతున్నారు.

 

 ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ వచ్చిందేమోనని అంద‌రూ అనుమానిస్తున్నారు. వాళ్లను టెస్ట్ చెయ్యడానికి సరిపడా బెడ్లు, కిట్లు లేక ఇదో పెద్ద సమస్య అయిపోతోంది. ఇండియాలో కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు మాస్కులు, ఇతరత్రా కొంటున్నారు. వైరస్‌పై ఉన్న భయం ప్రజల్ని అలా చేయిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: