ఈతరం వారు అవసరం ఉన్న లేకున్నా.. ఖచ్చితంగా ఒకటి వాడుతున్నారు అంటే అది హెడ్ ఫోన్స్ ఏ. అలాంటి ఈ హెడ్ ఫోన్స్ ద్వారా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో తెలుసా? నాకు తెలిసి మీకు తెలిసి ఉంటుంది. కానీ ఆ హెడ్ ఫోన్స్ వాడుతారు. అది మీ అవసరం.. మాకు అనవసరం ఇంకా ఏం చేస్తాం. సరే.. మీ గోల పక్కన పెడితే.. 

 

ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల ఎన్ని నష్టాలు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల ఏకాగ్రత కోల్పోవడం, నిద్రపట్టకపోవడం, తలనొప్పి రావడం, గుండె దడ పుట్టడం, చిన్న చిన్న కారణాలకే కోపం రావడం, శబ్దం నేరుగా కర్ణభేరిని తాకితే మెదడులో కణితలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. 

 

ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సెల్‌ఫోన్‌ను ఎడమచేతిలో పట్టుకుని ఫోన్ మాట్లాడటం మంచిది.. ఒకవేళ ఫోన్ ఎక్కువ సేపు మాట్లాడేలా అయితే స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడడం మంచిది. గుర్తింపు పొందిన కంపెనీల ఇయర్‌ ఫోన్లు, బ్లూటూత్‌లు వినియోగించడం మంచిది. వ్యాయామాలు చేసే సమయంలో స్పీకర్ల ద్వారా వింటే ఎంతో మంచిది.

 

చెవికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే చెవిలో ఇతరత్రా వస్తువులు పెట్టి కదిలించడం మంచిది కాదు. బహిరంగ ప్రదేశాల్లో చెవిని శుభ్రం చేయించుకోవడం కూడా సరైంది కాదు. ఏటా ఒకటి రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో మేలు. ఇలా చేశారు అంటే.. మీరు సౌండ్ ఇంజినీర్ కాకుండా ఉంటారు.. లేదంటే.. ఏ రా చిట్టిబాబు అని అనాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: