సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర ఎంతో కీలకం. శరీరం, మనసు పునరుత్తేజం పొందడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. సరైన ఆహారం లేకుంటే శరీరం ఇబ్బంది పడదేమో గాని, నిద్ర లేకుంటే మాత్రం కోలుకోలేదు. నిద్ర సామర్ధ్యాన్ని, నేర్చుకునే తత్వాన్ని,జ్ఞాపక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటల పాటు నిద్రించకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

 

రాత్రి హాయిగా నిద్రపోతే రోజంతా హాయిగా ఉంటుంది. నిద్ర సరిగా పట్టకపోతే ఆ రోజుంతా చాలా చిరాకుగా ఉంటుంది. రాత్రుల్లో నిద్రపోకుండా మేల్కొన్నట్లైతే.. ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, డయాబెటిస్, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు. అయితే కొందరు ఇలా బెడ్ మీద వాలగానే అలా గాఢ నిద్రలోకి జారిపోతారు. కొందరు ఓ అరగంటపాటు అటు ఇటూ మసులుతుంటే కానీ నిద్రపట్టదు. కానీ క్షణాల్లో నిద్రలోకి జారిపోయే వారికన్నా వీళ్లే బెటర్. 

 

ఎందుకూ అంటారా..? పడుకోగానే నిద్ర పోతున్నారంటే వారికి నిద్ర సరిగా సరిపోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం పడుకున్న తర్వాత నిద్ర పట్టడానికి ఓ పది 15 నిమిషాల సమయం పడుతుంది. అలా కాకుండా మనం 5 నిమిషాల్లోపే నిద్రలోకి జారుకుంటున్నామంటే.. మనకు సరిగా నిద్ర సరిపోవడం లేదని అర్థం. కాబట్టి రోజూ మనం సరిగా నిద్ర పోతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎన్ని ప‌నులు ఉన్నా.. వేలకు నిద్రపోవాలి. లేకపోతే నిద్రలేమితో అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: