ఈ మధ్య కాలంలో పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎక్కువగా పొటాటో చిప్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. వేళాపాళా లేకుండా పొటాటో చిప్స్ ను తింటూ గడిపేస్తున్నారు. మరి పొటాటో చిప్స్ తింటే శరీరానికి మేలు జరుగుతుందా...? లేదా...? అనే ప్రశ్నకు పొటాటో చిప్స్ వలన శరీరానికి మేలు కంటే హాని కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఎక్కువగా తింటే దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. 
 
పగటిపూట కంటే విశ్రాంతి తీసుకునే రాత్రి సమయంలో పొటాటో చిప్స్ తింటే ఈ ప్రమాదం మరింత ఎక్కువవుతుంది. డయాబెటిస్, హృదయ సంబంధిత వ్యాధులు ఎక్కువగా రాత్రి సమయంలో పొటాటో చిప్స్ తినేవారిలో వస్తున్నట్టు గుర్తించామని చెబుతున్నారు. మెక్సికో వర్సిటీ పరిశోధకులు దీని గురించి ఎన్నో పరిశోధనలు జరిపారు. మెక్సికో వర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
మెక్సికో వర్సిటీ పరిశోధకులు కొన్ని ఎలుకలను తీసుకొని ఎలుకలు విశ్రాంతి తీసుకునే సమయంలో కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను వాటికి పెట్టారు. ఆ సమయంలో ఎలుకలలో కొవ్వు స్థాయిలు అధికంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. పగటి సమయంలో కూడా ఎలుకలపై ఇదే ప్రయోగం చేయగా పగటి సమయంలో రాత్రి సమయంతో పోలిస్తే తక్కువగా ప్రభావం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రిపూట ఎక్కువ సమయం మెలుకువగా ఉండకూడదని పొటాటో చిప్స్, చిరుతిళ్ల వలన శరీరానికి ఎంతో నష్టమని పరిశోధకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: