చాలా మందికి అన్నం తిన్నతరువాత అరగని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వారికి ఆకలి వేయాలంటే చాలా సమయం పడుతుంది. సహజంగా మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన వారికి సాయంత్రం 7 సమయంకల్లా ఆకలి వేయాలి, అలా జరగక పొతే వారి ఒంట్లో ఫైబర్ శాతం తక్కువగా ఉన్నట్టే లెక్క. అలాంటి వారికి అరుగుదల కూడా చాలా తక్కువగా ఉందని చెప్పచ్చు. తిన్న ఆహరం పూర్తిగా జీర్ణం అవ్వాలి అంటే ముందు ఫైబర్ శాతం శరీరంలో ఎక్కువగా ఉండాలి. ఫైబర్ మంచిద కదా అని అధికంగా కూడా తీసుకోకూడదు. శరీరానికి మంచి చేసేది ఏదైనా సరే లిమిటెడ్ గానే తీసుకోవాలి.

 

ఫైబర్ అనేది కార్బోహైడ్రేట్. ఇది ఎక్కువగా పప్పులు, కూరలు, ఆకు కూరలల్లో ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ముఖ్యమైన సాధనం శరీరంలో ఇదొక్కటే. దీని పని తీరు వలనే మన ఆరోగ్య వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది, శరీరంలో చెడు కొవ్వుని తగ్గిస్తుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మనిషి రోజంతా చురుకుగా ఉండేలా చేయడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

 

ఫైబర్ వేటిలో ఎక్కువగా ఉంటుందంటే కూరగాయలు, పళ్ళు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పప్పు దినుసుల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో సారి ఫైబర్ ఎక్కువగా తీసుకున్న వారికి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ సార్లు టాయిలెట్ కి వెళ్తూ ఉంటారు, విరోచనాలు అవుతూ ఉంటాయి. అలాంటి వారు ఏమి చేయాలంటే. మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. రెండు రోజుల పాటు ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్ధాలని పక్కన పెడితే మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: