ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న, పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ చెక్ పెట్టాలంటే నిద్రనే ముఖ్యమట. 

 

ఇంకా ఈ డయాబెటీస్ గురించి చెప్పకూడదు లెండి.. ఈ డయాబెటిస్ ను మాయం చెయ్యాలంటే కాకరకాయ తినాలి.. బీరకాయ తినాలి, జొన్న రొట్టెలు తినాలి అని అంటారు.. కానీ ఈసారి అవి తినమని చెప్పటం లేదు... కష్టపడి పని చేసి సమయానికి చక్కగా నిద్రపోండి. అప్పుడే మీ డయాబెటిస్ తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. 

 

అయితే ఇటీవలే డయాబెటిస్ తగ్గించడానికి పరిశోధకలు పరిశోధనలు చెయ్యగా.. ఆ పరిశోధనలలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటి అంటే.. నిద్రలేమి కారణంగానే డయాబెటిస్ వచ్చింది అని చెప్తున్నారు పరిశోధకులు. 6గంటలు కన్నా తక్కువ నిద్రపోయే వారికే ఎక్కువ మంది డయాబెటిస్ వచ్చినట్టు డాక్టర్లు చెప్తున్నారు. 

 

అంతేకాదు ఆలా నిద్రించకపోవడం వల్లనే ఆల్రెడీ డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువ అవుతుందట. అందుకే.. రాత్రి సమయంలో ఖచ్చితంగా నిద్ర పోవాలని.. అది కూడా 7 నుండి 9 గంటలు నిద్రపోవాలని.. లేకపోతే డయాబెటిస్ ఎక్కువ అవుతుంది అని.. కరెక్ట్ నిద్ర సమయాన్ని పాటిస్తే ఆరోగ్యంగా మరింత మెరుగవుతుంది అని చెప్తున్నారు డాక్టర్లు. మరి ఇంకెందుకు ఆలస్యం.. డయాబెటిస్ ని కంట్రోల్ చేసెయ్యండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: