స్త్రీకి మాతృత్వం ఒక్క గొప్ప వరం. ప్రసవ సమయంలో తల్లి పడే వేదన అంత ఇంత కాదు. కానీ బిడ్డను చూసిన తల్లి ఆ సమయంలో తన ప్రసవ నొప్పిని సైతం మరిచిపోతుంది. తన రంగు, అందం, బాడీ షేప్ ఏవి పట్టించుకోకుండా కేవలం పుట్టబోయే బిడ్డ కోసమే ఆలోచిస్తుంది. డెలివరీ టైమ్‌లో కాసింత దైర్యం తప్ప. బిడ్డకు జన్మనివ్వటం అంటే తల్లి మరో జన్మ ఎత్తినట్టే అంటారు. కొన్ని సార్లు ప్రసవ సమయంలో తల్లులు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. 

 

ఇన్ని భయాలు ఉన్నా మరో బిడ్డకు జన్మనివ్వటానికి సిద్ధపడతారు. ప్రసవ సమయం ఆమె పడే వేదనను భర్త మాత్రమే తీర్చగలడు. ప్రసవ సమయంలో తన వెంట ఉంటడటమే ఆమె కోరుకునే దైర్యం. ఎందుకంటే భర్తకు మించిన ధైర్యం భార్యకు మరొకటి ఉండదు. తల్లీదండ్రులు, అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎంత మంది ఉన్నా తన భర్తకు సాటిరారు. ప్రసవ సమయంలో భర్త పక్కనే ఉండాలి. 

 

పురిటి నొప్పుల సమయంలో మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. డెలివరీ సజావుగా జరుగుతుందా లేక ఇబ్బంది ఏమైనా కలుగుతుందా? నొప్పిని భరించగలనా.. ఇలా మరెన్నో ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. ఆమె భర్త చెప్పిన కొన్ని శక్తివంతమైన మాటలు ఆమె కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఒత్తిడిని తగ్గించడానికి ఎలా సహాయపడ్డాయో వివరించారు.మాతృత్వాన్ని అన్ని రకాలుగా సాధారణీకరించడానికి, అందంగా తీర్చిదిద్దడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

 

పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నిస్తూ, ఛాంపియన్‌గా ఎదగడానికి, మాతృత్వం నిజంగా మనం పోటీ పడాల్సిన సవాలు కాదని ప్రజలు మర్చిపోతారు. సీజేరియన్ అయినా.. నార్మల్ డెలివరీ అయినా భయం లేదు. తల్లి పాలివ్వటానికైనా.. బాటిల్ ఫీడింగ్ కోసమైనా భయం లేదు. ఇలా ప్రతీ ఒక్క విషయం గురించి ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రతీ ఒక్క మహిళ కూడా డెలివరీ కోసం ఇలానే ఆలోచించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: