రోజూ ఉదయాన్నే పాలు తాగడం మంచి అలవాటే. ఎందుకంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను మిల్క్ ద్వారా పొందవచ్చు. కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి వంటివి పాల ద్వారా శరీరానికి అందుతాయి. ఇక రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయని మాత్రమే మనకు తెలిసిన‌ విష‌యం. అయితే పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. రోజుకు రెండు గ్లాసులకు మించి తాగకూడదని ఇటీవల కొన్ని పరిశోధనలో తేలింది. రోజూ మోతాదుకు మించి పాలు తాగితే.. అనవసర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది.

 

పాలు ఎన్నో వ్యాధులను తరిమికొడుతుంది. అలాగే మరెన్నో వ్యాధులను తీసుకొస్తుంది కూడా. పాలు ఎక్కువగా తాగడం వలన చాలా మందిలో ఎసిడిటీ వస్తుంది. దీన్ని వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి. మ‌రియు చాలా మంది రాత్రిళ్లు నిద్రకు ముందు పాలు తాగి వెంటనే పడుకుంటారు. ఇలా చేస్తే మీరు రోగాలను కోరి కొనితెచ్చుకున్నట్లే. ఎందుకంటే రాత్రి పాలు తాగిన వెంటనే నిద్రపోకూడదు. 

 

పాలు తాగిన తర్వాత కనీసం రెండు, మూడు గంటల తర్వాత పడుకోవడం ఉత్తమం. చాలా మంది పాలలో చక్కెర కలుపుకొని తాగుతారు. దీని వలన కడుపులో మంట, యాక్సిడేటివ్ స్ట్రెస్ కలుగుతుంది. అదే విధంగా కణాల పైనా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పాలలో చక్కెర కలుపుకోవాలంటే.. చాలా తక్కువగా వేసుకోవాలి. కాగా, మోతాదులో పాలు తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండ‌వు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: