కమలాపండు.. పెద్ద‌గా ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. ఇక ఆరెంజ్ ఫ్లేవర్ సాధారణంగా అందరికి ఇట్టే నచ్చుతుంది. చూడటానికి మంచి రంగు, అంతకుమించిన రుచి.. ఎవరినైనా ఈ కమల పండ్లు ఇష్టపడేలా చేస్తాయి. కమలాపండ్లలో శరీరానికి అవసరమమ్యే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్‌ సీతో నిండి ఉండే ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించి మనిషి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపకరిస్తాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా కమలా పండ్ల నుంచి లభిస్తుంది.

 

వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కమలాపండ్లని తినడం ద్వారా కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది.. ఈ కారణంగా బరువు తగ్గుతారు. శరీర పెరుగుదలకి, జీవక్రియలకి, బి.పి.ని తగ్గించడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు కమల పండుతో దాదాపు 260 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. మ‌రియు ఇందులోని లైకోపీన్‌ పోషకం కాన్సర్‌ కారకాలతో పోరాడుతుందని నిపుణులు అంటున్నారు. ఇక కమలాలు ప్రతీ ఒక్కరికి మంచివే. కానీ రోజుకీ మూడు కమలాలని మించి తినకూడదట. 

 

అలాగే భోజనానికి ముందు కానీ, ఖాళీ కడుపుతో కానీ ఈ పండ్లను అస్సలు తీసుకోకూడదట. ఎందుకంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. అలాగే పాలు తాగాక వెంటనే కమలాల జ్యూస్ తాగకూడదట. కనీసం గంట వ్యవధి ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలలోని ప్రోటీన్లు కమలాలలోని ఆమ్లంతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: